poulomi avante poulomi avante

తుక్కుగూడలో ఉబెర్ లగ్జరీ ఫ్లాట్లు

కాలుష్యమయ జీవితానికి దూరంగా, నగరానికి దగ్గర్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లుంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా? మీలాంటి వారి కోసమే గ్రీన్ స్టోన్ డెవలపర్స్ ఓ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. శంషాబాద్ తుక్కుగూడలో ప్రకృతి ఓడిలో కదంబ ఫారెస్టు పేరుతో ఉబెర్ లగ్జీరియస్ 2, 3 బీహెచ్ కే స్పేసియస్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తోంది. దాదాపు 18 వేల ఎకరాల మహేశ్వరం అడవి సమీపంలో 3.15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కామన్ ఏరియాల్లో సోలార్ పవర్‌తో పాటు స్థిరమైన విద్యుత్ సరఫరా, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ ప్యానెల్, జీరో వాటర్ వేస్టేజ్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. గ్రీన్ ప్రాజెక్టుగా గోద్రేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి వీలుగా విశాలమైన పచ్చని ప్రదేశాలతో ఈ అపార్టుమెంట్లు వస్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలంతో పాటు పెద్దలంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి రచ్చబండ తరహా ఏర్పాటు కూడా ఉంది. పిల్లలు, పెద్దల అవసరాలకు అనుగుణంగా బోలెడు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతటా పచ్చదనం ఉండటం వల్ల అటు పిల్లలు, ఇటు పెద్దలు కూడా చక్కని జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒక్క వాస్తు మాత్రమే కాకుండా వృక్షశాస్త్ర, జీవావరణ శాస్త్ర, సుస్థిరత రంగాల నిపుణులందరూ కలిసి ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. వంద టన్నుల స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేసే ఆకులు, పొదలు, చెట్లు, తీగలతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది.

స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులతో ఒకదానికొకటి అనుసంధానం కలిగిన ఆరు బ్లాకుల్లో మొత్తం 240 అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది లో రైజ్ బిల్డింగ్ జోన్ కావడం వల్ల ఎత్తైన ఆకాశహర్మ్యాలు నిర్మించే అవకాశం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు ఇక్కడ నివసించే ప్రతి కుటుంబానికి ధారాళంగా దక్కుతాయి. టచ్ లెస్ లిఫ్టులు, మినీ సూపర్ మార్కెట్, బాంకెట్ హాల్, ఆర్గానిక్ కేఫ్ అండ్ రెస్టారెంట్, రూఫ్ టాప్ పార్టీ ఏరియా, 24 గంటల ఆక్సిజన్ సరఫరాతో కూడిన డిస్పెన్సరీ , హెర్బల్ గార్డెన్, రాక్ గార్డెన్, పెద్దల కోసం ప్రత్యేక స్థలం, సెంట్రలైజ్డ్ ఎల్పీజీ కనెక్షన్, సైకిల్ పార్కింగ్, క్లబ్ కదంబ, ఏసీ జిమ్, యోగా, పిల్లలు, పెద్దల కోసం స్విమింగ్ పూల్స్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి
లోకేషన్ పరంగా చూస్తే.. ఫ్యాబ్ సిటీకి 5 నిమిషాలు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 10 నిమిషాలు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 25 నిమిషాలు పడుతుంది. ఔటర్ ఎగ్జిట్ 14కి ఐదు నిమిషాలు, శ్రీశైలం హైవేకి 2 నిమిషాలు చాలు. అలాగే ప్రముఖ విద్యా సంస్థలతో పాటు ఆస్పత్రులు, బిజినెస్ హబ్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు చాలా సమీపంలోనే ఉన్నాయి. ఓ వైపు వ్యవసయా పచ్చిక బయళ్లు, మరోవైపు 18 వేల ఎకరాల తుక్కుగూడ-లేమూర్ రిజర్వు ఫారెస్టు ఉండటం వల్ల సమీపంలో ఎత్తైన ప్రాజెక్టులు రానే రావు. అందువల్ల కదంబ ఫారెస్టులో జీవితం ఆనందంగా, సంపూర్ణంగా ఉంటుంది. అపార్ట్ మెంట్ ధర రూ.55 లక్షల నుంచి ప్రారంభం. మరి కదంబ ఫారెస్టులో జీవించడానికి రెడీయేనా?
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles