Categories: TOP STORIES

ఎల్‌బీన‌గ‌ర్‌లో రియ‌ల్ సంస్థ‌ అమాయ‌కుల‌కు టోపి?

    • యూడీఎస్‌, ప్రీ లాంచ్ అంటూ ఓ రియ‌ల్ కంపెనీ ప్ర‌చారం
    • పూర్తి వివ‌రాల‌తో సద‌రు సంస్థకు వెళ్లిన రెరా సిబ్బంది
    • అక్క‌డికెళితే క‌నిపించ‌ని రియ‌ల్ సంస్థ‌..
    • అందులో పాత సంస్థ బ‌దులు కొత్త కంపెనీ
    • విస్తు పోయిన రెరా యంత్రాంగం
    • అందులో కొన్న‌వారంతా ఆందోళ‌న
    • రెరా కూడా న్యాయం చేయ‌లేని దుస్థితి

యూడీఎస్‌, ప్రీలాంచుల పేరిట హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న మోసాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టి హైద‌రాబాద్‌ కొస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో యూడీఎస్ స్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డంతో మోస‌పూరిత రియ‌ల్ట‌ర్లకు ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు. అందుకే, ఎవ‌రికీ తెలియ‌కుండా ఆయా ఆఫీసుల్ని మూసేస్తున్నారని సమాచారం. దీంతో, అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ల‌బోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

అది తూర్పు హైద‌రాబాద్‌లోని ఎల్బీ న‌గ‌ర్‌లో ఏర్పాటైన ఒక రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ. యూడీఎస్‌, ప్రీ లాంచులు అంటూ తెగ హ‌డావిడి చేసింది. అమాయ‌కుల నుంచి భారీ స్థాయిలో సొమ్ము వ‌సూలు చేసింది. కొంత‌మందికి యూడీఎస్ ప్లాట్ల‌నూ రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్రీలాంచు అంటూ ఎక్క‌డ్లేని ప్ర‌చారానికి తెర‌లేపింది. సోష‌ల్ మీడియాలో కొంత హ‌ల్ చ‌ల్ చేసింది. దీంతో, తెలంగాణ రెరా అథారిటీ అధికారులు ఆయా కంపెనీ పూర్వాప‌రాలు తెలుసుకుందామ‌ని వెళ్లారు. తీరా అక్క‌డికి వెళ్లి చూస్తే.. ఆ సంస్థ లేనే లేదు. అదే స్థానంలో మ‌రొక కొత్త కంపెనీ ఏర్పాటైంది. దీంతో, రెరా అధికారులే విస్తుపోయార‌ని స‌మాచారం. మ‌రి, ఆయా కంపెనీ వ‌ద్ద ప్లాట్లు కొన్న‌వారి ప‌రిస్థితి ఏమిటి? దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది? యూడీఎస్లో కొన‌డం వ‌ల్ల అటు తెలంగాణ రెరా అథారిటీకి ఫిర్యాదు చేయ‌లేరు. ఎందుకంటే, రెరా నుంచి అనుమ‌తి పొందిన ప్రాజెక్టులో ప్లాట్లు కొన్నారు కాబ‌ట్టి, రెరా అథారిటీ ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేదు. మ‌రెలా.. ఇలాంటి మోసపూరిత రియ‌ల్ట‌ర్ల చేతిలో సామాన్యులు మోస‌పోవాల్సిందేనా? ఇలాంటి వ్య‌వ‌హారాల్లో ఆయా రియ‌ల్ట‌ర్ల‌పై పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేయాలి. ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. లేక‌పోతే, ఇలాంటి రియ‌ల్ట‌ర్ల చేతిలో అనేక మంది అమాయ‌కులు మోస‌పోయే ప్ర‌మాద‌ముంది.

* తెలంగాణ రెరా అథారిటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 500 గ‌జాలు దాటిన స్థ‌లంలో ఎనిమిది కంటే అధిక ప్లాట్లు, ఫ్లాట్ల‌ను అభివృద్ధి చేసే ప్రమోట‌ర్ క‌చ్చితంగా తెలంగాణ రెరా అథారిటీ వ‌ద్ద న‌మోదు చేసుకోవాలి. కొనుగోలుదారుల నుంచి వ‌సూలు చేసే సొమ్ములో డెబ్బ‌య్ శాతం సొమ్మును ప్ర‌త్యేకంగా ఎస్క్రో ఖాతాలో జ‌మ చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివ‌రాల్ని రెరా అథారిటీకి అంద‌జేయాలి. ఇలాంటి ప్రాజెక్టులో ఎవ‌రైనా కొనుగోలు చేస్తే త‌ప్ప‌కుండా రెరా అథారిటీ సాయం చేస్తుంది. ఫ్లాట్లు కొన్న ఐదేళ్ల దాకా నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని స‌ద‌రు సంస్థే చూడాల్సి ఉంటుంది.

This website uses cookies.