దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(ఎన్‌జీడీఆర్ఎస్) అమల్లోకి తెస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది? తాజా పథకాన్ని యధావిధిగా రాష్ట్రాలన్నీ అమలు చేయాలా? లలేక మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశమిస్తారా? వంటి అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన వ్యవస్థను ప్రవేశపెడతామని బడ్జెట్‌లో తెలిపారు. ఈ విధానాన్ని గతంలో హైదరాబాద్‌లో అమలైనప్పుడు ప్రతికూల ప్రభావం కనిపించింది. కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరి, ఇలాంటి అక్రమాలకు జరగకుండా కొత్త చట్టంలో ప్రత్యేక చర్యలేమైనా తీసుకుంటారా? అనే విషయం తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు కల్పిస్తామన్నారు. మరి, ఇందుకు సంబంధించి మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యతనిస్తారనే అంశాన్ని గమనించాలి.