హైదరాబాద్లో అమ్ముడుకాని ఇళ్ల సంఖ్య దాదాపు పన్నెండు వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే.. వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలలైనా పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ, కరోనా వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐటీ సెక్టార్ బావుంటే అదే స్థాయిలో రియల్ ఊపు కనిపిస్తుంది. ఐటీ డీలా పడితే రియల్ కూడా కుదేలవుతుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇక్కడ ఇళ్ల డిమాండ్ తగ్గిపోయింది. అనంతరం గత దశాబ్దంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రియల్ రంగం కాస్త ప్రభావితమైంది. ఇక ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఎలాంటి సమస్యలూ లేకుండా సాగుతోంది. అప్పటి నుంచి క్రమంగా హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ అభివృద్ధి చెందింది. అయితే, సరిపడినంతగా ఇళ్లు లేకపోవడం, పరిమితమైన అమ్మకాల వల్ల ధరలు పెరిగాయి. కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇళ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ అధ్యయనం చేసిన 8 నగరాల్లో.. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కోవిడ్ సమయంలో కూడా ఇళ్ల ధరలు తగ్గలేదని వెల్లడైంది.
హౌసింగ్ యూనిట్స్ ప్రారంభం 16,712
హౌసింగ్ యూనిట్స్ అమ్మకాలు 11,974
సగటు ధర రూ.50,803 (స్క్వేర్ మీటర్)
రూ.4,720 (స్క్వేర్ ఫీట్)
విక్రయం కాని ఇళ్ల సంఖ్య 11,918
ఎన్నిక్వార్టర్లలో అమ్మవచ్చు? 3.2
This website uses cookies.