- ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టులతో
హైదరాబాద్లో లగ్జరీ నిర్మాణాలు - చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలు
- నివాస, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక ముద్ర
- కొనుగోలుదారులకు అమూల్యమైన సేవలు
అరబిందో రియాల్టీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ భారతదేశ నిర్మాణ రంగంలో అప్రతిహతంగా దూసుకెళుతోంది. కొత్త తరహా డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం రియల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపెడుతూ ముందుకెళుతోంది. రెరా నిబంధనల్ని అనుసరిస్తూ.. సాంకేతికత, వృత్తి నైపుణ్యం, పనితీరు వంటివి అరబిందో కొనుగోలుదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందజేస్తున్నాయి.
అరబిందో సంస్థ ప్రధాన విలువల గురించి చెప్పాల్సి వస్తే.. ఆధునిక ఆవిష్కరణలు, నమ్మకం, సమగ్రమైన రీతిలో శ్రేష్ఠమైన సేవలను కొనుగోలుదారులకు అందజేస్తోంది. నిర్మాణాల్లో నాణ్యతను పాటిస్తూ.. సమయానికి ఫ్లాట్లను అందజేస్తోంది. కొనుగోలుదారులకు సంతృప్తిని అందజేయడం మీదే దృష్టి సారిస్తోంది. దశాబ్దాల నుంచి ఈ రంగంలో స్థిరపడిన డెవలపర్లకు సవాలును విసురుతూ.. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటి విభాగాల్లో తమదైన ప్రత్యేకతను చాటి చెబుతోంది. కొనుగోలుదారులకు వ్యక్తిగత సేవల్ని అందజేస్తూ , వారి అవసరాల్ని తీరుస్తుంది. తమ నిర్మాణాల్ని చేపట్టేందుకు ఏకంగా ప్రీక్యాస్ట్ పరిశ్రమను 21 ఎకరాల్లో పటాన్‌చెరులో ఏర్పాటు చేసింది. ఏటా మూడు మిలియన్ చదరపు అడుగుల హాలో కోర్ శ్లాబులు, యాభై వేల లీనియర్ మీటర్ల బీములు, 18 వేల లీనియర్ మీటర్ల కాలమ్‌లు, 1200 మెట్లను తయారు చేస్తుంది.
వాణిజ్య సముదాయాలివే..
జాతీయ మరియు అంతర్జాతీయ కొనుగోలుదారులకు వాణిజ్య సముదాయాలకు సంబంధించి మెరుగైన సేవల్ని అందించేందుకు ప్రత్యేకంగా వాణిజ్య రియాల్టీ బృందాన్ని ఏర్పాటు చేసింది. వాణిజ్య స్థలాల విక్రయం, వాటిని అద్దెకివ్వడం వంటి అంశాల్లో మెరుగైన సేవల్ని కస్టమర్లకు అందజేస్తోంది. ప్రపంచ ఐటీ సంస్థల అవసరాలకు అతికినట్లు సరిపోయే విధంగా రెండు బడా వాణిజ్య సముదాయాల్ని అరబిందో నిర్మించింది. గెలాక్సీ, ఆర్బిట్.. ఈ రెండూ తమ ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి.
‘ ఆర్బిట్ 25 అంతస్తుల ఫ్యూచరిస్టిక్ ఆఫీస్ భవనం. దీన్ని హైదరాబాద్ ఐటీ హబ్ నడిబొడ్డున వ్యూహాత్మకమైన ప్రాంతంలో డెవలప్ చేశారు. ఈ వాణిజ్య సముదాయాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యూకే ఆర్కిటెక్ట్, చాప్‌మన్ & టేలర్ రూపొందించారు. 50,000 చ.అ.ల శక్తివంతమైన ఫ్లోర్ ప్లేట్‌తో 1.25 మిలియన్ చదరపు అడుగుల ప్రైమ్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఇందులో లభిస్తుంది. ఇది ప్రజా రవాణా నెట్‌వర్క్ మరియు రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌కు కనెక్ట్ చేయబడింది. ఈ భవనం ఆర్కిటెక్చర్ అద్భుతం అని చెప్పొచ్చు. అందుకే, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ అవార్డ్స్- ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ అవార్డ్స్ 2018 ద్వారా “బెస్ట్ ఆఫీస్ ఆర్కిటెక్చర్ ఇండియా” అవార్డును పొందింది.
ఆకాశహర్మ్యాల్లో సరికొత్త రికార్డు
ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లో అరబిందో రియాల్టీ తమ ప్రత్యేకతను చాటి చెప్పేందుకు.. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూకే ఆర్కిటెక్ట్ చాప్‌మన్ అండ్ టేలర్ సేవల్ని వినియోగించింది. హైటెక్ సిటీ చేరువలో 12 ఎకరాల్లో సుమారు 42 అంతస్తుల ఆకాశహర్మ్యం అయిన కొహినూర్ అనే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కేవలం అతికొద్ది మంది మాత్రమే నివసించేందుకు ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇది విలాసవంతమైన ఆభరణాలతో అలంకరించినట్లుగా కనిపిస్తోంది. కోహినూర్ ఆనందం యొక్క గొప్పతనాన్ని గమనించాలంటే.. సుమారు యాభై వేల చదరపు అడుగుల్లో తీర్చిదిద్దిన క్లబ్ కోహినూర్‌ని చూస్తే అర్థమవుతుంది. క్లబ్‌హౌస్‌లో జిమ్, కేఫ్‌టీరియా, స్పా, స్క్వాష్ కోర్ట్, గెస్ట్ రూమ్‌లు, మల్టీపర్పస్ రూమ్‌లు వంటివి దాదాపు 45 అమెనిటీస్ ఉన్నాయి.
సౌకర్యవంతం, విలాసవంతం, గ్లామరస్.. ఈ మూడూ కలగలిపిన అదిరిపోయే అపార్టుమెంట్ కావాలనుకునే వారికి అరబిందో రియల్టీ గ్రూప్ ‘కోహినూర్’ ప్రాజెక్టు చాలా చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. హైటెక్ సిటీలో విశాలమైన స్థలంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. పేరుకు తగ్గట్టుగానే అంత విలువైనది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 80 శాతం ఓపెన్ స్పేస్ తో 42 అంతస్తుల చొప్పున ఏడు టవర్లతో కళ్లు చెదిరేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఇందులో 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
అరబిందో రీజెంట్
సువిశాలమైన పచ్చదనం మధ్య ఖరీదైన జీవనశైలిని ఆస్వాదించాలనుకునేవారికి అరబిందో రియాల్టీ సంస్థ అత్యద్భుతంగా నిర్మిస్తున్న రీజెంట్ ప్రాజెక్టు చక్కగా సరిపోతుంది. పచ్చదనాన్ని చూస్తూ గోపి చెరువు పై నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రతిరోజూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకుమించిన స్థలం మరొకటి ఉండదేమో. శేరిలింగంపల్లిలో ఏకంగా 2300 ఎకరాల సువిశాలమైన పచ్చని స్థలాన్ని వీక్షించేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు నభూతో న భవిష్యత్ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఫేజ్-1లో 6.3 ఎకరాల స్థలంలో 39 అంతస్తులతో మూడు ప్రతిష్టాత్మక టవర్లు నిర్మిస్తారు. 80కి పైగా ఆధునిక జీవన సౌకర్యాలతో హైటెక్ సిటీ, ఇతర ప్రముఖ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు.. మీ కలల సౌధానికి కేరాఫ్ అడ్రస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.