కొనుగోలుదారులకేం కావాలి.. వారి అభిరుచి ఏమిటనే విషయాన్ని ముందే కనుక్కుని.. వైష్ణవీ ఇన్ ఫ్రాకాన్ ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తుంది. రోజూ ప్రయాణం కోసమే ఎక్కువ సమయాన్ని గడపకుండా.. ఎంచక్కా ఇంట్లో సేద తీరేందుకే అధిక సమయాన్ని వెచ్చించాలని కోరుకునేవారికి నచ్చేలా నిర్మాణాల్ని చేపడుతుందనే పేరును వైష్ణవీ ఇన్ఫ్రాకాన్ సంపాదించింది. బయ్యర్ల నుంచి చక్కటి మన్ననల్ని అందుకునే వైష్ణవీ ఇన్ఫ్రాకాన్ తాజాగా హౌదిని అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హౌదిని అంటే.. ప్రతిరోజు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటమే సంస్థ చెబుతోంది. ఇక్కడి నుంచి ఐటీ కారిడార్ కు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు. ఐదంటే ఐదే నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు వెళ్లడానికి పట్టేది కేవలం ఇరవై నిమిషాలే. ఇలాంటి అంశాల వల్లే ఇందులో నివసించడం ద్వారా ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చని సంస్థ చెబుతోంది.
బండ్లగూడ జాగీర్‌లో ఓయాసిస్ ప్రాజెక్టు ద్వారా కొనుగోలుదారుల మన్ననల్ని పొందిన వైష్ణవీ ఇన్ఫ్రాకాన్.. అదే ప్రాంతంలో మరో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటికీ శ్రీకారం చుట్టింది. దీనికి వైష్ణవి హౌదిని అని పేరు పెట్టింది. దాదాపు 4.10 ఎకరాల్లో 3 టవర్లను చేపడుతోంది. ఒక్కో టవర్ ఎత్తును పదిహేను అంతస్తుల్లో కడుతోంది. ఇందులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 585. వైష్ణవి హౌదిని ప్రత్యేకత ఏమిటంటే.. రెండు పడక గదుల ఫ్లాట్లకు పెద్దపీట వేసింది. 1068 చదరపు అడుగుల నుంచి ఫ్లాట్లు ఆరంభమవుతాయి. ఇందులోనే నాలుగు సైజుల్లో ఫ్లాట్లను డిజైన్ చేసింది. మూడు పడక గదుల ఫ్లాట్లను 1607 సైజు నుంచి లభిస్తాయి. 1861, 1952, 2028 సైజుల్లో దొరకుతాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఈ ప్రాజెక్టు చక్కటి అవకాశమని సంస్థ అంటోంది.
మంచి రెస్పాన్స్..
బండ్లగూడలో వైష్ణవీ ఓయాసిస్ అనే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. మా ప్రాజెక్టును చూసిన అనేక మంది కస్టమర్ల రిఫరెన్స్ ద్వారా హౌదిని లో చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. మేం ఊహించిన దానికంటే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మా వైష్ణవీ ఇన్ ఫ్రాకాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటివరకూ దాదాపు నలభై లగ్జరీ అపార్టుమెంట్లను పూర్తి చేశాం. ఇందులో దాదాపు 4500 ఫ్లాట్లను నిర్మించాం. 12 వేలకు పైగా హ్యాపీ కస్టమర్లు ఈ సంస్థకు సొంతం. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎల్బీనగర్లో కొత్తగా లగ్జరీ బిజినెస్ కాల్స్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వైష్ణవి బుపారా అని నామకరణం చేసిన ఈ నిర్మాణం ఎల్బీనగర్లోనే ప్రప్రథమ హైరైజ్ లగ్జరీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. – పాండురంగారెడ్డి, ఎండీ, వైష్ణవీ ఇన్ఫ్రాకాన్.