Categories: TOP STORIES

ఆనందాన్ని నింపే.. ఆక‌ర్ష‌ణీయ నిర్మాణం

  • వాసవి అట్లాంటిస్
  • నార్సింగిలో అదిరిపోయే
    ప్రీమియం లగ్జరీ ఫ్లాట్లు
  • 3300 చ. అ. వరకు వివిధ సైజుల్లో
    2, 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు
  • 85 స్కై విల్లాలు కూడా ల‌భ్యం

సూర్యోదయాన్ని చూస్తే సంతోషం.. తాజా గాలిని పీలిస్తే ఆనందం.. ప్రత్యేకమైన నిర్మాణశైలితో కూడిన ఇంట్లో నివసిస్తే ఉత్సాహం.. ఈ మూడూ కలిసి ఉన్నదే వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు. నిర్మాణరంగంలో 27 ఏళ్ల అనుభవం ఉన్న వాసవి గ్రూప్.. నాణ్యతలో రాజీపడకుండా కొనుగోలుదారుల ఆనందమే ధ్యేయంగా ఈ ప్రాజక్టును నిర్మిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో 8 ఆకాశహర్మ్యాలు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తం 45 అంతస్తుల్లో 2199 అపార్ట్ మెంట్ల (2, 3, 4 బీహెచ్ కే) తోపాటు 85 స్కై విల్లాలు కూడా ఉన్నాయి. 3330 చదరపు అడుగుల వరకు వివిధ పరిమాణాల్లో ప్లాట్లు డిజైన్ చేశారు.

చుట్టూ గ్రీనరీ, సరస్సుతోపాటు అపార్ట్ మెంట్ లోకి మరింత స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు వీలుగా వెర్టికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 45 అంతస్తులు ఉన్న ఆ టవర్లను చూస్తే మేఘాల్లోకి చొచ్చుకుపోయాయా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆ దృశ్యం చూస్తే వావ్ అని అనకుండా ఉండలేరు. అటు సంతోషమే కాదు.. ఇటు ఆరోగ్యానికీ పెద్దపేట వేశారు. బయటి ప్రపంచం రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యవంతంగా జీవించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ప్రాజెక్టు గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి లోపలకు అడుగు పెట్టగానే సరికొత్త ప్రపంచంలోకి వెళుతున్న అనుభూతి సొంతమవుతుంది. ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ రూపొందించారు.

ఆధునిక సౌక‌ర్యాలు అదుర్స్‌

వాసవి అట్లాంటిస్ లో ఉన్న బోలెడు సౌకర్యాలు మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. అత్యుత్తమ శ్రేణి సౌకర్యాలు మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన సొగసైన వినోద ప్రదేశాలు మీకు ఆరోగ్యాన్నే కాకుండా ఆనందాన్ని, మన:శ్శాంతిని కలిగిస్తాయి. కుటుంబం, స్నేహితులు, ఇరుగు పొరుగువారితో కాస్త తీరికగా కబుర్లు చెప్పడానికి ఇంతకుమించిన మంచి ప్రదేశం దొరకడు. తాజా గాలిని ఆస్వాదిస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ మజాయే వేరు కదా? ఇక మీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి అదిరిపోయే రెండు క్లబ్ హౌస్ లు కూడా ఉన్నాయి.

అలాగే ఫిట్ నెస్ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, వర్క్ ఫ్రం హోం బిజినెస్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, వాకింగ్, జాగింగ్ ట్రాక్, పార్టీ లాన్లు, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ అరేనా, కిడ్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్, ఫుడ్ కోర్టు, బాంకెట్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్ వంటి 50కి పైగా సౌకర్యాలున్నాయి. 24 గంటల సెక్యూరిటీ మరింత భద్రత కల్పిస్తుంది. అటు విలాసవంతంగా, ఇటు ఆహ్లాదకరంగా ఉండేలా ఎందులోనూ తగ్గకుండా అదిరిపోయే రీతిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఇక లోకేషన్ కూడా గచ్చిబౌలి, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా వెళ్లే అవకాశం ఉంది. ఫ్లాట్ ధర రూ.1.7 కోట్ల నుంచి మొదలవుతోంది. బుకింగ్ అమౌంట్ కింద ప్లాట్ ధరలో 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ డెలివరీ సమయంలో ఇస్తే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వాసవి అట్లాంటిస్ చూడండి.. సంతోషంగా అందులో పెట్టుబడి పెట్టి మీ జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానించండి.

This website uses cookies.