- వాసవి గ్రూప్ సీఎండీ యెర్రం విజయ్ కుమార్
- దావోస్‌లో మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా
- విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు
- హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేదు!
- వాసవి గ్రూప్.. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్
- హైటెక్ సిటీలో వాసవి స్కైలా
- నార్సింగిలో వాసవి అట్లాంటిస్
- నిర్మాణాలకు అల్యూమినియం ఫోమ్ టెక్నాలజీ
- మూడేళ్లలోపు పూర్తయ్యే అవకాశం
హైదరాబాద్ నిర్మాణ రంగం కుప్పకూలుతుందని.. మార్కెట్ మటాష్ అవుతుందని.. కొందరు గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పనిగట్టుకుని.. కావాలని చేస్తున్న ఈ ప్రతికూల ప్రచారం వల్ల హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదనేది అక్షర సత్యం. మార్కెట్ పడిపోతుందనో.. ఇంకేదో అవుతుందనో జరుగుతున్న ప్రచారం ఒట్టి బోగస్. అమెరికా సబ్ ప్రైమ్ క్రైసిస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న చరిత్ర మన హైదరాబాద్ నిర్మాణ రంగానిది. కాబట్టి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. మన రియల్ రంగానికి జరిగే నష్టమేం లేదని వాసవి గ్రూప్ ఎండీ యెర్రం విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. వాటిని సమర్థంగా తట్టుకుని నిలబడ్డవారే రియల్ రంగంలో విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..
మంత్రి కేటీఆర్ దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల్ని, ప్రతినిధుల్ని కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాల్ని వివరిస్తున్నారు. మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ మైకెల్ ఫ్రోమన్ని కలిసి ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్నైడర్ ఎలక్ట్రిక్ ఈవీపీ లూక్ రెమోంట్ని కలిసి ఆయా సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని హైదరాబాద్‌లో పెట్టేందుకు ఒప్పించారు. స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేసే ఫెర్రింగ్ ఫార్మా రూ.500 కోట్ల పెట్టుబడిని ఇక్కడ పెట్టేందుకు అంగీకరించింది. కొత్తగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. ఇందుకోసం వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచంలోని పేరెన్నిక గల సంస్థలు హైదరాబాద్‌ను తమ డెస్టినేషన్‌గా మార్చుకున్నాయి. ఈ జాబితాలో మరిన్ని సంస్థలు చేరుతాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చాలామంది భాగ్యనగరంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి, వారికి నాణ్యమైన ల్యాండ్ మార్క్ కట్టడాల్ని అందించాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ క్రమంలో రెండు బడా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను ఆరంభించాం. ఇవి వాక్ టు వర్క్ కాన్సెప్టుకు ప్రతిబింబంగా నిలుస్తాయి.
నార్సింగిలో వాసవి అట్లాంటిస్, హైటెక్ సిటీలో వాసవి స్కైలా ప్రాజెక్టుల్ని ఆరంభించాం. ఆధునిక యువతీ యువకులకు అమితంగా నచ్చుతాయి. ఇందులో నివసించే కుటుంబాలన్నీ ప్రతిక్షణం ఆస్వాదించే విధంగా నిర్మాణాల్ని తీర్చిదిద్దుతాం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ప్రతిఒక్కరికీ నప్పే విధంగా ఈ నిర్మాణాలుంటాయి. రానున్న రోజుల్లో అతివేగంగా అభివృద్ధిపథంలో దూసుకెళ్లడానికి అవకాశముందన్న అంశాన్ని అంచనా వేశాకే.. హైదరాబాద్‌లో ఆధునిక కట్టడాల్ని ఆవిష్కరిస్తున్నాం.
హైటెక్ సిటీలో..
హైదరాబాద్ ప్రధాన ఆకర్షణ అయిన హైటెక్ సిటీలో వాసవి స్కైలా అనే బ్యూటీఫుల్ లగ్జరీ ప్రాజెక్టును 6.23 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. 32 అంతస్తుల ఎత్తులో ఐదు టవర్లు వస్తాయి. ఇందులో 3, 3 ప్లస్ 4 ప్లస్, 5 ప్లస్ తో పాటు స్కై విల్లాస్ నిర్మిస్తాం. ఒక్కోటి 2100 నుంచి 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. కేవలం క్లబ్ హౌజును యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తాం. ప్రస్తుతం పునాదుల దశలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును సుమారు మూడేళ్లలోపు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. నాణ్యమైన రీతిలో వేగంగా ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు అల్యూమినియం ఫోమ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం.
27 గ్రాముల బంగారు నాణెం ఫ్రీ
వాసవి అట్లాంటిస్, వాసవి స్కైలా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేవారికి వాసవి గ్రూప్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్లాట్లను బుక్ చేసేవారికి 27 గ్రాముల బంగారు నాణెంని ఉచితంగా అందజేస్తోంది. ఈ అవకాశం జూన్ 30వరకే వర్తింపజేసింది. 1994లో ఆరంభమైన వాసవి గ్రూప్.. ఇప్పటివరకూ 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 17 కమర్షియల్ ప్రాజెక్టుల్ని నిర్మించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.