వాసవి సరోవర్ @ కూకట్‌పల్లి.. ఈ నెల 4న గ్రాండ్ లాంచ్
21.48 ఎకరాలు
11 టవర్లు.. 2,530 ఫ్లాట్లు
ఎత్తు 29 అంతస్తులు
ఫ్లాట్ల విస్తీర్ణం.. 1280- 2895 చ.అ.
3 క్లబ్‌హౌజులు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు మూడు దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్.. ఈ నెల 4న అంటే సోమవారం రోజున.. వాసవి సరోవర్ అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని అట్టహాసంగా ఆరంభించనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగే ఈ లాంచ్‌కు నిర్మాణ రంగంలోని అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభం కానుంది. అటు కోర్ సిటీ.. ఇటు హైటెక్ సిటీ.. మధ్యలో ఉండే కూకట్‌పల్లిలో.. సుమారు 21.48 ఎకరాల్లో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్‌ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్టు ద్వారా పరిచయం చేస్తోంది. ఇప్పటివరకూ బడా ప్రాజెక్టుల్లో రెండు క్లబ్ హౌజుల్ని మాత్రమే చూశాం. కానీ, ఇందులో మాత్రం ఏకంగా మూడు క్లబ్ హౌజుల్ని వాసవి గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ తెలుసుకుంటే.. ఆతర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు.
హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేసిషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి.. వాసవి గ్రూప్ శ్రీకారం చుట్టింది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును సుమారు 21. 48 ఎకరాల్లో కడుతోంది. ఇందులోని పదకొండు టవర్లలో దాదాపు 2,530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తుల దాకా ఉంటుంది. చుట్టుపక్కల చక్కటి వాతావారణం గల ఈ ప్రాజెక్టులో.. వివిధ సైజుల్లో టూ, త్రీ, ఫోర్ బెడ్‌రూం ఫ్లాట్లను నిర్మిస్తారు. ఫ్లాట్ల సైజు విషయానికి వస్తే 1280 చదరపు అడుగుల్లో టూ బెడ్రూమ్ ఆరంభమవుతాయి. గరిష్ఠంగా 2,895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి.
స్ట్రాటజిక్ లొకేషన్ అయిన కూకట్‌పల్లిలో వాసవి సరోవర్ ఆరంభం కావడం వల్ల ఇందులో నివసించేవారికి సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులన్నీ అత్యంత సమీపంలో ఉంటాయి. ఇక్కడ్నుంచి ముంబై హైవే కేవలం రెండు కిలోమీటర్లే. రెండున్నర కిలోమీటర్లలో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కూకట్‌పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్‌పేట్, పంజాగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్‌లకు ఈజీగా రాకపోకల్ని సాగించొచ్చు. టీఎస్ రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టును టాప్ ఆర్కిటెక్టులు డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాటుకు గాలీ వెలుతురు ధారాళంగా వస్తుంది. స్వచ్ఛమైన వెలుతురు రావడం వల్ల నివాసితులు జీవనాన్ని ఆనందంగా గడపొచ్చు.
నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్‌లో మూడు క్లబ్ హౌజుల్ని అభివృద్ధి చేస్తారు. విస్తీర్ణం 96 వేల 660 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ కావాల్సిన సమస్త సదుపాయాల్ని ఇందులో పొందుపరిచారు. ఇందులో 85 స్కై విల్లాలు.. 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. ఈ నెల 4న హైదరాబాద్లోని నోవాటెల్‌లో అట్టహాసంగా ఆరంభం కానున్న ఈ ప్రాజెక్టులో వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ బుక్ చేసుకోండి.. మీ పిల్లాపాపలతో సంతోషంగా గడపండి..