Categories: Uncategorized

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్

  • జూన్ త్రైమాసికంలో 7 శాతం పెరుగుదల
  • మరో 43 పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి

హైదరాబాద్ లో ఇళ్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగాయి. ఈ మేరకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌ బీ) తాజాగా విడుదల చేసిన ‘హౌసింగ్‌ ప్రెస్‌ ఇండెక్స్‌’ లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. అయితే, కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు కూడా బాగానే ఉందని పేర్కొంది. నగరాలవారీగా చూస్తే.. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున పెరిగాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున పెంపుదల నమోదైంది. మొత్తం మీద జూన్ త్రైమాసికంలో 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు గతేడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 4.8 శాతం మేర పెరగడం గమనార్హం. గతేడాది త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి.

This website uses cookies.