ప్రపంచ సంస్థల్ని విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్‌లో సరికొత్త ల్యాండ్‌మార్క్ గచ్చిబౌలిలో ఆవిష్కృతమవుతోంది. అందులోకి అడుగుపెడితే చాలు.. మీకు సరికొత్త అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాలమైన లంగ్ స్పేసెస్ తో తీర్చిదిద్దిన అతి మనోహరమైన ఆఫీసుకు ఉదయం వెళ్లి.. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేసి.. రాత్రి పూట ఎంచక్కా అక్కడే విలువైన సమయాన్ని గడపొచ్చు. కలిసి భోజనమూ చేయవచ్చు. మరి, ఇలాంటి చక్కటి అనుభవాన్ని మీకు అందించేందుకు గచ్చిబౌలిలో సర్వాంగసుందరగా ముస్తాబవుతోంది.. వాసవి స్కై సిటీ. ఇదో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ హబ్.. వర్క్, షాప్, జాయ్.. ఇలా వైవిధ్యమైన అనుభూతిని పొందేందుకు.. స్కైసిటీ చూడచక్కగా రూపుదిద్దుకుంటోంది.
వాసవి గ్రూప్.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. నగరంలో వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో వైవిధ్యమైన నిర్మాణాల్ని చేపడుతూ దూసుకెళుతోంది. ఈ క్రమంలో గచ్చిబౌలిలో వాసవి స్కై సిటీని చేపట్టింది. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో.. రెండు బ్లాకుల్ని నిర్మిస్తోంది. ఇందులో సుమారు 27 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తోంది. విశాలంగా.. అత్యాధునికంగా లాబీ కనిపించేందుకు ట్రిపుల్ హైట్ ఎయిర్ కండీషన్ గా డిజైన్ చేశారు. దీని వల్ల సందర్శకుల్ని ఇట్టే ఆకట్టుకోవడానికి సాధ్యమవుతుంది. సులభమైన రీతిలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
హైస్పీడ్ ఎలివేటర్లు, సర్వీస్ ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. అగ్నివ్యాప్తిని నిరోధించేందుకు ఆధునిక పరికరాల్ని బిగించారు. ఇందులోని ఆఫీసుల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న స్కైసిటీని నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థకు అప్పగిస్తారు. పైగా, ఇందులో నిర్వహణ ఖర్చులూ తక్కువే అని చెప్పొచ్చు.
This website uses cookies.