సిడ్నీలో హైవే మీద హోటల్స్, ప్లే ఏరియాస్, గ్రీన్ జోన్స్ అభివృద్ధి చేశారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సిడ్నీ చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. లేక్ చుట్టూ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, బోటింగ్, పార్కులు వంటివి ఏర్పాటు చేశారు. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కి చేరడానికి కేవలం ఇరవై నిమిషాలే పడుతుంది. భారత దేశంలో కూడా పోలీసింగ్ మెంటాలిటీ ని వదిలేసి.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేలా నగరాలను డెవలప్ చేయాలి.
ఇందుకు చక్కటి ఉదాహరణ సిడ్నీ నగరంగా అభివర్ణించొచ్చు. మన ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే.. మన నగరాలూ గణనీయంగా డెవలప్ అవుతాయని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. సిడ్నీ లో రెంటల్ హోమ్స్ కు మంచి ఆదరణ పెరుగుతోందని అన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శేఖర్ పటేల్ మాట్లాడుతూ.. 2007లో నాలుగు శాతం ఉన్న జీడీపీ 8 శాతానికి చేరిందని అన్నారు. మొత్తం భారత దేశం జీడీపీలో నిర్మాణ రంగా వాటా 16 శాతం దాకా ఉంటుందని అన్నారు.