లీగల్ ప్రాసెస్‌ను దుర్వినియోగం చేసినందుకు యూపీ రెరా ఒక కొనుగోలుదారుడికి జరిమానా విధించింది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న చర్యల్లో భాగంగా.. తాజా నిర్ణయం తీసుకుంది. లేకపోతే, రెరా అంటే అటు బిల్డర్లలో ఇటు కొనుగోలుదారుల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదముంది.
ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే నిర్మాణ రంగంలో జవాబుదారీతనం ఏర్పడుతుంది. పైగా, భవిష్యత్తులో ప్రతిఒక్కరూ రెరా నిబంధనల్ని పాటించేందుకు ఆస్కారముంది. మరి, ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీ ఇంతే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. మరి, ఆ రోజు ఎప్పుడొస్తుందో..!