మూసీ బ్యూటీఫికేషన్ కు సంబంధించి పనులు ఎంతవరకూ వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల క్రితం హెచ్ఎండీఏ బృంద సభ్యులు.. గుజరాత్‌లోని సబర్మతి, యమున రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల్ని అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి)లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.
మరి, ఆ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మూసీ నదిని ఎలా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని హెచ్ఎండీఏ వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, గతంలో కూడా బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీడీఎంఏ, మున్సిపల్ అధికారులు అనేకసార్లు ఇలాగే అహ్మదాబాద్ సబర్మతి నదితో పాటు పలు ఇతర నదుల చుట్టూ తిరిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.