poulomi avante poulomi avante

బడ్జెట్లో రియల్ రంగానికి ఇచ్చిందేంటంటే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఏమేం కావాలో పరిశ్రమకు చెందిన పలువురు వినతులు, సూచనలు చేశారు. మరి అవన్నీ వచ్చాయా? అసులు స్తిరాస్థి రంగానికి నిర్మలమ్మ ఏమిచ్చారో చూద్దామా?

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై)..

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్‌ 2.0 పథకాన్ని చేపడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

రెంటల్ హౌసింగ్..

రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్లను ప్రోత్సహించేందుకు అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని నిర్మల తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో అద్దె గృహాలు నిర్మిస్తామని వెల్లడించారు.

స్టాంప్‌ డ్యూటీ..

రాష్ట్రాలు అధికంగా ఉన్న స్టాంపు డ్యూటీని తగ్గించేలా కేంద్ర ప్రోత్సహిస్తుందని నిర్మల చెప్పారు. అధిక స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనిని తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు.

భూ సంస్కరణలు..

భూ సంబంధిత సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య లేదా భూ-ఆధార్‌ను కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. పట్టణ భూ రికార్డులన్నిటినీ డిజిటైజేషన్‌ చేయాలని కూడా ప్రతిపాదించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్రాలతో కేంద్రం సం‍ప్రదింపులు జరుపుతుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో ఈ సంస్కరణలు పూర్తి చేసేందుకు రాష్ట్రాలను ప్రోత్సహించేలా కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణ, పట్టణ ప్రణాళిక, వినియోగం భూ సంబంధిత సంస్కరణలు, చర్యల్లో భాగంగా ఉంటాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఎల్‌పీఐఎన్‌) లేదా భూ-ఆధార్‌ కేటాయింపు, ప్రస్తుత యాజమాన్యానికి అనుగుణంగా భూ మ్యాప్‌ల డిజిటైజేషన్‌, మ్యాప్‌ సబ్‌ డివిజన్ల సర్వే, భూముల రిజిస్ట్రీ తయారీ, దానికి రైతుల అనుసంధానం వంటివి ఉంటాయని తెలిపారు. పట్టణ భూములను జీఐఎస్‌ మ్యాపింగ్‌తో డిజిటైజ్‌ చేస్తామన్నారు. ఆస్తుల రికార్డు నిర్వహణ, అప్‌డేటింగ్‌, పన్నుల నిర్వహణ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థను నెలకొల్పుతామని పేర్కొన్నారు.

గ్రోత్ హబ్స్ గా నగరాలు..

నగరాలను గ్రోత్ హబ్స్ గా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలతో కేంద్రం కలిసి పని చేస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఆర్థిక, రవాణా ప్రణాళికతో, టౌన్ ప్లానింగ్ పథకాలతో పెరి అర్బన్ ఏరియాలను తగిన విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అమరావతికి రూ.15వేల కోట్లు..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం పలు ఏజెన్సీల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. వచ్చే సంవత్సరాల్లో అదనంగా కూడా సాయం చేయనుంది.

పీఎం సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన..

తాత్కాలిక బడ్జెట్ లో ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి మంచి స్పందన రావడంతో దీనిని మరింత ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద దేశంలోని కోటి ఇళ్లకు రాయితీలో సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందిస్తుంది.

ఇండస్ల్రియల్ పార్కులు..

దేశంలోని దాదాపు వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనుంది. అలాగే నేషనల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద 12 ఇండస్ట్రియల్ పార్కులు మంజూరు చేయనుంది.

కమర్షియల్ రియల్ ఎస్టేట్ కు డిమాండ్

ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయడం, విదేశ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వంటి చర్యలు స్టార్టప్స్ తోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ)కు ప్రోత్సాహకరం. ఇవి కమర్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్ ను బాగా పెంచుతాయి.

– జి. హరిబాబు, నరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles