Categories: TOP STORIES

ల‌గ్జ‌రీ విల్లాల ప‌య‌నం ఎటు?

వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. ఇంటర్నేషనల్‌ ఎంఎన్‌సీ కంపెనీలు. ఎక్కడ్నుంచి ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లే వెసులుబాటు ఉన్న కనెక్టివిటీ రోడ్లు. ఢోకా లేని ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌. ట్రాఫిక్‌ కష్టాలు తొలగించే ఫ్లై ఓవర్లు. విదేశాలకు వెళ్లాలంటే అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడైతే లైఫ్‌ బెస్ట్‌గా లీడింగ్‌ చేయొచ్చనే ఫీలింగ్‌. ఒక నగరానికి ఇంతకు మించి ఏం కావాలి. ఈ క్వాలిటీస్‌ అన్నీ ఉన్నాయి కాబట్టే హైద్రాబాద్‌లో సొంతిల్లు ఉండాలని కోరుకునే వారెందరో.

ఓ వైపు బడ్జెట్‌ అపార్ట్‌మెంట్‌లు. అదర్‌ సైడ్‌ లగ్జరీ విల్లాస్‌. ఈ రెండిటి కాంబినేషనే హైద్రాబాద్‌. విలాసాలను కోరుకునే వారు మాత్రం సొంతిల్లు అంటే అపార్ట్‌మెంట్లో ఫ్లాట్‌ అనే ఓపీనియన్‌ నుంచి పొష్‌ ఏరియాలో లగ్జరీ విల్లా ఉండాలి అనే రేంజ్‌లో ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే విల్లాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి.

ఫ్లాట్లు.. హైరేజ్‌ అపార్ట్‌మెంట్లు ఎన్ని ఉన్నా విలాసానికి చిరునామా మాత్రం విల్లాలే. ఒకప్పుడు సెలబ్రిటీలు.. పొలిటిషీయన్స్‌, బిజినెస్‌ లాంటి హై ప్రొఫైల్స్‌కు మాత్రమే పరిమితమైన విల్లాలు.. ఇప్పుడు అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌కు కూడా చేరువయ్యాయ్‌. బడ్జెట్‌కు తగ్గట్టు దొరుకుతున్నాయి విల్లాలు. అపార్ట్‌మెంట్లలో వందల మందితో కలిసి ఉండటం ఇష్టం లేని వారు విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు.

గతంలో ముంబై, గుర్గావ్‌, ఢిల్లీ, బెంగళూర్‌ లాంటి సిటీస్‌కే పరిమితమైన ఆంబీషియస్‌ లగ్జరీ విల్లాలు ఇప్పుడు హైద్రాబాద్‌లోనూ కనిపిస్తున్నాయ్‌. 10 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టగలిగే వారు ఇలాంటి విల్లాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో విల్లా ఉండాలనుకునే వారు కొందరైతే. నగరం నడిబొడ్డున విశాలమైన లగ్జరీ విల్లాలో లైఫ్‌ లీడ్‌ చేయాలనుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే సిటీ సెంట్రల్‌జోన్‌లో అత్యంత విలాసవంతమైన విల్లాలను నిర్మించాయి కొన్ని సంస్థలు. ముఖ్యంగా రిచ్‌నెస్‌ అండ్‌ లగ్జరీకి కేరాఫ్‌గా ఉండే జుబ్లీహిల్స్‌లో విల్లాలు కావాలనుకునే వారికి వీటిల్లో మంచి ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయ్‌.

జూబ్లీహిల్స్‌- హైద్రాబాద్‌లో ఈ కాస్ట్‌లీ ఏరియా గురించి స్పెషల్‌ ఇంట్రడక్షన్స్‌ అక్కర్లేదు. నగరం ఎంత విస్తరించినా.. మిగిలిన ఏరియాల్లో ఎన్ని ఆధునిక వసతులు.. సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. జుబ్లీహిల్స్‌లో ఇల్లు ఉందని చెప్పుకోవడం స్టిల్‌ స్టేటస్‌ సింబల్‌. అందుకే బిగ్‌షాట్లంతా కేరాఫ్‌ జుబ్లీహిల్స్‌ అని చెప్పుకోడానికే ప్రయార్టీ ఇస్తారు. కోట్లు కుమ్మరించే సత్తా ఉన్నవాళ్లకి జుబ్లీహిల్స్‌.. సరౌండింగ్‌లో ఓన్‌ విల్లాల్ని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు డెవలపర్స్‌. గుట్టల బేగంపేట్‌, హైటెక్‌ సిటీ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలను అందుబాటులోకి తెచ్చారు.

జూబ్లీహిల్స్‌- గుట్టల బేగంపేట్‌లో 4 వేల 223 నుంచి 4 వేల 245 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లాలను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు నిర్మిస్తున్నాయి. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌ పరిధిలోకి వస్తుంది గుట్టల బేగంపేట్‌. 5 నుంచి 10 కిలోమీటర్లలోపే టాప్‌ కంపెనీలు.. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌, ఎంటర్‌టైన్‌జోన్స్‌, ఇంకాస్త ముందుకెళితే ఈజీగా ఓఆర్‌ఆర్‌ కనెక్టివిటీ ఇలా అన్ని రకాల సదుపాయాలుండటం ఈ ఏరియాకి బాగా కలిసొచ్చే పాయింట్‌. వెస్ట్‌ అండ్‌ ఈస్ట్‌ హైద్రాబాద్‌కు మధ్యలో ఉండటం వల్ల ట్రాన్స్‌పోర్ట్‌కు ప్రాబ్లమే లేదు.

అందుకే విశాలం.. విలాసవంతం కోరుకునే వారికి ఫోర్‌ బీహెచ్‌కే ట్రిపులెక్స్‌ విల్లాలను నిర్మిస్తున్నారు. ఈ ఏరియాలో చదరపు అడుగు 10 వేల రూపాయలుగా ఉంది. ఇక జుబ్లీహిల్స్‌- హైటెక్‌ సిటీ ఎక్స్‌టెన్షన్‌లోనూ విల్లాల నిర్మాణం జోరుగా సాగుతోంది. భాగ్యనగరం నడిబొడ్డున ఉండటం ఈ ప్రాంతానికి కూడా ఫేవర్‌ చేసే పాయింట్. ఇక్కడ 6 వేల 787 స్క్వేర్‌ఫీట్‌ నుంచి 10 వేల 287 చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో ఫైవ్‌ బీహెచ్‌కే లగ్జరీ విల్లాస్‌ను కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నాయి కంపెనీలు. ఈ లగ్జరీ విల్లాల కాస్ట్‌ విషయానికొస్తే 15 నుంచి 23 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉన్నాయ్‌.

This website uses cookies.