దుబాయ్ విహారయాత్రకు వెళ్లినా.. అక్కడ నివసించడానికి వెళ్లినా.. అపార్ట్ మెంట్ ఎంచుకోవడంలో ఏదైనా పొరపాటు చేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి దుబాయ్ లో అద్దెకు అపార్ట్ మెంట్ ను ఎలా ఎంచుకోవాలో కోలైఫ్ అనే రెంటల్ కంపెనీకి చెందిన నిపుణులు వివరిస్తున్నారు. ముందుగా దుబాయ్ లో అద్దెకు డిమాండ్ ఉన్న టాప్ 3 ప్రాంతాల గురించి చెప్పారు.
దుబాయ్ మెరీనా..
తొలిసారిగా దుబాయ్ వచ్చేవారికి ఇదో చక్కని ప్రదేశం. అద్దె ఇంటి కోసం కోలైఫ్ ని సంప్రదించేవారిలో దాదాపు 30 శాతం మంది ఇక్కడే కావాలని అడుగుతారు. బే సమీపంలో ఉండటం.. చుట్టూ గాజు ఆకాశహర్మ్యాలతో ఉన్న కృత్రిమ కాలువ, బ్లూ వాటర్స్ ద్వీపం ఇక్కడే ఉండటంతో చాలామంది దుబాయ్ మెరీనాలో ఉండటానికి ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడ స్టూడియో రూమ్ 9వేల నుంచి 10వేల దీరమ్స్ కి లభిస్తుంది. సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దె 12,500 దీరమ్స్ నుంచి ప్రారంభమవుతుంది. అదే 2 బెడ్ రూమ్ ఫ్లాట్ అయితే 16వేల దీరమ్స్ వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన జిమ్, పూల్, కోవర్కింగ్ స్పేస్ తో కూడి ప్రిన్సెస్ టవర్ ఉంది. సముద్రానికి, ప్రొమెనేడ్, మెట్రో స్టేషన్ కాలినడక దూరంలో ఉంది. అలాగే మెరీనా గేట్ టవర్ కూడా ఇక్కడే ఉంది.
దుబాయ్ హిల్స్..
అద్దెదారుల మన్ననలు త్వరగ చూరగొన్న ప్రాంతం ఇది. పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న కుటుంబాలతోపాటు పెద్దపెద్ద రణగొణ ధ్వనులతో అలసిపోయిన నివాసితులను ఇది బాగా ఆకర్షిస్తుంది. దుబాయ్ హిల్స్ చాలా దూరంలో ఉన్నందున ఇక్కడ ఉండాలనుకునేవారికి కారు చాలా అవసరం. దీనిని నగరం లోపలి నగరంగా పిలుస్తారు. పెద్ద షాపింగ్ సెంటర్లు, కేఫ్ లు, రెస్టారెంట్లు, డాగ్ పార్కులు, టెన్నిస్ కోర్టు వంటి ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ స్టూడియో రూమ్ 11వేల దీరమ్స్ నుంచి, సింగ్ బెడ్ రూమ్ ఫ్లాట్ 13వేల దీరమ్స్ నుంచి, డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ 20వేల దీరమ్స్ నుంచి అద్దెలు ప్రారంభమవుతాయి. కలెక్టివ్ 1, కలెక్టివ్ 2 టవర్లు యువ నిపుణులకు అనువైన ప్రదేశం. విలాసవంతమైన ఇంట్లో ఉండాలనుకునేవారు పినాకిల్ ని ఎంచుకోవచ్చు. ఇందులో ఆధునిక ఫిట్ నెస్ సెంటర్, పూల్, పిల్లల ఆటస్థలం వంటివి ఉన్నాయి.
పచ్చని ప్రకృతి మధ్యలో ఉండాలని కోరుకునేవారికి ఇది చక్కని ఎంపిక. కోలైఫ్ క్లయింట్లలో 15 శాతం మంది డౌన్ టౌన్ లో ఉండటానికి ఆసక్తి కనబరిచారు. మీ కిటికీ నుంచే బుర్జ్ ఖలీఫా ను చూడొచ్చు. అలాగే దుబాయ్ మాల్ నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఉంటుంది. మీరు దుబాయ్ లో పని చేస్తుంటే, మీ ఆఫీసు కూడా దగ్గర్లోనే ఉండొచ్చు. ఇక్కడ స్టూడియో రూమ్ అద్దె 9వేల దీరమ్స్ నుంచి మొదలవుతుంది. సింగిల్ బెడ్ రూమ్ అద్దె 11500 దీరమ్స్ నుంచి, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె 16వేల దీరమ్స్ నుంచి ప్రారంభమవుతాయి. బౌలేవార్డ్ టవర్ ఇక్కడ అత్యంత ఆదరణ పొందిన టవర్. బుర్జ్ క్రౌన్ కూడా ఇక్కడే ఉంది.
This website uses cookies.