poulomi avante poulomi avante

పసిడా.. ప్రాపర్టీనా?

  • పెట్టుబడులకు ఏది సరైన ఎంపిక?
  • ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అటు పసిడి, ఇటు ప్రాపర్టీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరువలో ఉంది. మరోవైపు రియల్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగారం, రియల్ ఎస్టేట్.. పెట్టుబడులకు ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో చాలామందికి తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అయితే, ఈ రెండింటిలో ఏది సరైనది అనే అంశం.. మీ లక్ష్యాలు, రిస్క్ టాలరెస్, సమయంపై ఆధారపడి ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావాలు ప్రపంచ మార్కెట్ లో అస్థిరతను సృష్టించాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి వేదికలను అన్వేషించడం మొదలుపెట్టారు.

సాంప్రదాయకంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారాన్ని నమ్మదగిన అంశంగా భావిస్తుండగా.. రియల్ ఎస్టేట్ ను దీర్ఘకాలిక సంపద సృష్టికి ప్రాధాన్యతనిచ్చే ఎంపికగా చూస్తున్నారు. 2024లో బంగారం 20% కంటే ఎక్కువ రాబడిని అందించింది. పైగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా అందుబాటులో ఉంటుంది. స్వల్పకాలిక భద్రత మరియు ద్రవ్యత కోరుకునే పెట్టుబడిదారులకు ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారింది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే.. మూలధన పెరుగుదల, అద్దె ఆదాయం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి సాధారణంగా అధిక ముందస్తు పెట్టుబడి అవసరం.

నగదు పరపతిలో బంగారం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, స్థిరమైన, దీర్ఘకాలిక ఆస్తిగా దీనిని పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మీరు దేనిని ఎంచుకోవాలని అనేది మీ లక్ష్యాలు, రిస్క్ భరించే స్థాయి, సమయంపై ఆధారపడి ఉంటాయి. స్వల్పకాలిక స్థిరత్వం కోసం బంగారం మంచి ఎంపిక కావచ్చు. దీర్ఘకాలిక సంపదను నిర్మించడానికి, ఆదాయాన్ని సంపాదించడానికి రియల్ ఎస్టేట్ సరైన ఎంపిక అవుతుంది. అదే సమయంలో రెండింటినీ కలిగి ఉన్న వైవిధ్యభరితమైన పోర్ట్ ఫోలియో రిస్క్, రివార్డును సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు గత కొన్ని నెలలుగా లగ్జరీ గృహాలు అమ్మకాలు జోరుగా సాగాయి. మొత్తం అమ్మకాల్లో దాదాపు 50% కంటే ఎక్కువ భాగం వీటిదే. అలాగే అధిక ద్రవ్యోల్బణం, పట్టణ వినియోగం నెమ్మదించిన కారణంగా అందుబాట గృహాల డిమాండ్ మందగించింది. వాస్తవానికి రియల్ ఎస్టేట్ అనేది ఎల్లప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది. దాని స్పష్టమైన స్వభావం సురక్షితమైన పెట్టుబడి అంశంగా అనిపిస్తుంది. బంగారానికి, ప్రాపర్టీకి మధ్య ముఖ్యమైన తేడా నగదు మార్పిడే. బంగారాన్ని ఎప్పుడంటే అప్పుడు దాని ప్రస్తుత ధరకు నగదులోకి మార్చుకోవచ్చు. ఇదంతా నిమిషాల్లోనే అయిపోతుంది. కానీ ప్రాపర్టీని వెంటనే అమ్మలేం. దీనికి కొంత సమయం పడుతుంది. పైగా ధరలో హెచ్చుతగ్గులు కూడా ఉండొచ్చు.

బంగారం మెరుపులు..

ఇటీవల కాలంలో బంగారం స్పష్టంగా రియల్ ఎస్టేట్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. కానీ ఈ పనితీరును సందర్భోచితంగా చూడాలి. బంగారం వృద్ధి చెందే ఆస్తి కాదు.. దానిని ఓ హెడ్జ్ లా చూడాలి. బంగారం ప్రస్తుతం భారీగా పెరిగిపోతుండటంతో దీనిని అధిక రాబడి ఇచ్చే వస్తువుగా ప్రజలు భావిస్తారు. కానీ అది సరికాదని నిపుణులు అంటున్నారు. ప్రసుతం బంగారం అనేది పెట్టుబడిదారులకు ఆనందమయంగా ఉందని.. ఇది చాలా ప్రాపర్టీల కంటే ఎక్కువ రాబడి ఇవ్వడమే కారణమని చెబుతున్నారు. అయితే, అన్ని వేళలా ఇదే పరిస్థితి ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్ రెండింటికీ వాటి ప్రయోజనాలు ఉన్నాయి, అవి మీ లక్ష్యాలు, సమయం, ద్రవ్యత అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది పెట్టుబడిదారులు తమ ఈక్విటీ పెట్టుబడులతోనే కొనసాగాలా లేదా వారి పోర్ట్ ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులలోకి మార్చాలా అని ఆలోచిస్తున్నారు. ర్ఘకాలిక హోరిజోన్, అధిక-రిస్క్ టాలరెన్స్ ఉన్నవారికి, ఈక్విటీలు అధిక రాబడిని అందించాయి. ఈక్విటీలు స్వల్పకాలంలో అస్థిరంగా ఉండవచ్చు, కానీ దీర్ఘకాలంలో అవి గణనీయమైన వృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. అంతిమంగా, పెట్టుబడి నిర్ణయం వ్యక్తిగత లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles