తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు.. నగరానికి చెందిన పావని గ్రూప్ హెచ్ఎండీఏతో కలిసి ప్రప్రథమంగా అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ జాయింట్ వెంచర్‌ను ఆరంభించింది. పీపీపీ విధానంలో ఆరంభించిన అతిపెద్ద మల్టీపుల్ యూజ్‌జోన్ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. తొంభై ఐదు ఎకరాల్లో డెవలప్ చేసిన ఈ వెంచర్‌ను షాద్ నగర్ చేరువలోని ఇన్ముల్‌నర్వలో మొదలైంది. ఈ వెంచర్‌లో లాజిస్టిక్స్ పార్క్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్టుమెంట్స్, విల్లాస్, విద్యాసంస్థలు, ఆస్పత్రులు వంటివి డెవలప్ చేయడానికి ప్రణాళికల్ని రచించారని సమాచారం. ఎన్‌సీసీ సంస్థ ఈ వెంచర్‌ను డెవలప్ చేయగా..
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ విభాగం గ్రీనరీని అభివృద్ధి చేస్తోందని తెలిసింది. ఇందులో మొత్తం 1200 ప్లాట్లు వస్తుండగా.. ప్లాటు సైజు 200 నుంచి వెయ్యి గజాలుంటాయని సమాచారం. ఇంతవరకైతే బాగానే ఉంది కానీ.. ఈ ప్రప్రథమ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టును ఇప్పటివరకూ హెచ్ఎండీఏ అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే, హెచ్ఎండీఏ పేరు చెప్పుకుని పావని రాయల్‌లో ప్లాట్లను విక్రయిస్తున్నారు. మరి, ఇందులో ప్లాట్లు కొనాలా? వద్దా? అని పలువురు కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ గురును సంప్రదించారు. ఇదే అంశాన్ని పురపాలక శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి సమాచారం రాలేదు. మరి, ఇప్పటికైనా పావని గ్రూప్‌తో కలిసి డెవలప్ చేస్తున్న పావని రాయల్ గురించి హెచ్ఎండీఏ అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని పలువురు బయ్యర్లు కోరుతున్నారు.