పరిమిత లభ్యత: మున్సిపల్ పరిధిలోని రెసిడెన్షియల్ ఆస్తులతో పోలిస్తే కమర్షియల్ ప్రాపర్టీలకు తక్కువ భూమి ఉంటుంది. డిమాండ్.. సరఫరా కంటే ఎక్కువ ఉండటంతో వాణిజ్య భూముల కొరత వాటి ధరలు పెంచుతుంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు అందుబాటులో ఉన్న వాణిజ్య స్థలాలకోసం పోటీపడాల్సి వస్తుంది. ఇవన్నీ కలిసి వాటి విలువ పెంచుతాయి. దీంతో అవి ఖరీదైనవిగా మారతాయి.
ప్రధాన ప్రాంతాలు: వాణిజ్య ఆస్తులు సాధారణంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లేదా అధిక జన సమ్మర్థం ఉన్న లేదా అద్భుతమైన వ్యాపార సామర్థ్యం ఉన్న ప్రధాన ప్రాంతాల్లోనే ఉంటాయి. ఈ లొకేషన్లు రవాణా, ఇతరత్రా సౌకర్యాలు కలిగి ఉన్న కారణంగా ఎక్కువ మంది వచ్చి వెళ్లే వీలు కల్పిస్తాయి. ఫలితంగా ఇలాంటి ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాపర్టీల కోసం పెట్టుబడిదారులు పోటీ పడుతుంటారు. దీంతో అక్కడి ఆస్తుల ధరలు ఆటోమేటిగ్గా పెరుగుతాయి.
అద్దె ఆదాయంలో పోటీ: నివాస ఆస్తులతో పోలిస్తే వాణిజ్య ఆస్తులకు అద్దె అధికంగా వస్తుంది. అందువల్ల ఎక్కువగా అద్దె అదాయం రావాలనుకునే పెట్టుబడిదారులు కమర్షియల్ ప్రాపర్టీల కోసం పోటీ పడతారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.
ప్రముఖ అద్దెదారులకు డిమాండ్: బహుళజాతి కంపెనీలు తమ వ్యాపారాల కోసం వాణిజ్య స్థలాలను కోనుగోలు చేయడం కంటే లీజుకు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇది పెట్టుబడిదారులకు ప్రముఖ కంపెనీలను దీర్ఘకాలిక అద్దెదారులుగా ఉండే అవకాశం కల్పిస్తుంది. అందువల్ల ప్రముఖ కంపెనీలకు మంచి డిమాండ్ ఉంటుంది.
డెవలప్ మెంట్ ఖర్చులు: రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో పోలిస్తే.. కమర్షియల్ ప్రాపర్టీలను డెవలప్ చేయడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లు అధిక డెవలప్ మెంట్ చార్జీలు విధిస్తాయి. అంతే కాకుండా వాణిజ్య ప్రాజెక్టులకు కఠినమైన నియమాలు, నియంత్రణలు ఉంటాయి. ప్రత్యేక మౌలిక సదుపాయాల, పార్కింగ్ సౌకర్యాల వంటివి అదనపు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా వాణిజ్య ఆస్తులు అధిక ధరలు కలిగి ఉంటున్నాయి.
వ్యయ వ్యత్యాసాలు: ఆదాయ సంభావ్యత, లొకేషన్, మార్కెట్ డైనమిక్స్, నిర్వహణ వ్యయాలు, లీజు నిబంధనలకు సంబంధించి వివిధ అంశాల కారణంగా నివాస ఆస్తుల కంటే వాణిజ్య ఆస్తులు ఖరీదైనవిగా ఉంటాయి.
ఆదాయ సంభావ్యత: రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో పోలిస్తే వాణిజ్య ఆస్తులు అధిక అద్దె ఆదాయానికి అవకాశం కల్పిస్తాయి. గణనీయమైన రాబడిని, ఆకర్షణీయమైన అద్దె దిగుబడిని అందించగల సామర్థ్యం అధిక కొనుగోలు ధరలకు అవకాశమిస్తుంది.
లొకేషన్, యాక్సెసిబులిటీ: కమర్షియల్ ప్రాంతాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే ఉంటాయి. కస్టమర్లు, క్లయింట్లు, వ్యాపార అవకాశాలను ఆకర్షించడానికి ఈ ప్రాంతాలు వ్యూహాత్మకంగా ఉంటాయి. దీంతో ఈ లొకేషన్లలో వాణిజ్య ఆస్తులకు డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. ఈ కారణాల నేపథ్యంలో నివాస ఆస్తుల కంటే వాణిజ్య ఆస్తులు అధిక ధరలు కలిగి ఉంటాయి.
This website uses cookies.