ఏపీలోని సాగర నగరం విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సెంటర్లో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి. ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభించిన అనంతరం ఉద్యోగులు, సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా ఏపీలో టైర్-1 నగరంగా ఎదిగే అన్ని అర్హతలూ వైజాగ్ కు ఉన్నాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం టైర్-1 నగరంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దసరా తర్వాత పాలన విశాఖ నుంచే జరుగుతుందని గతంలో ప్రకటించినప్పటకీ, ఇంకా కార్యాలయాల అందుబాటు లేకపోవడం, ఇతరత్రా సమస్యల కారణంగా వాయిదా పడిందని జగన్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పాలన వైజాగ్ నుంచే జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి చర్యలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
This website uses cookies.