భారత్ లో రియల్ రంగం దూసుకెళ్తోంది. వ్యవసాయం తర్వాత దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగం ఇదే. కరోనా కాలంలో స్వల్ప ఒడుదొడుకులకు మాత్రమే లోనైన భారత స్తిరాస్థి రంగం ఆ తర్వాత క్రమంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో భారత రియల్ రంగంలో పెట్టుబడి అత్యంత సురక్షితమని పలువురు పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నారు. మరి మన రియల్ రంగం పెట్టుబడులకు ఎందుకు స్వర్గధామమో చూద్దామా?
- ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటి.
- ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా సరే.. ఎన్నారైలు స్వదేశంలో స్తిరాస్థి కలిగి ఉండాలని భావిస్తారు.
- సరైన ప్రాపర్టీని ఎంచుకోవడం, ఆపై పెట్టుబడి పెట్టడం అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో 2016లో కేంద్రం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది రియల్ రంగాన్ని నియంత్రించడంతోపాటు సమర్థవంతమైన, పారదర్శక పద్ధతిలో ఆస్తుల విక్రయాలను చేయాలని లక్ష్యంగా చేసుకున్నందున కొనుగోలుదారుల్లో పూర్తి విశ్వాసం వచ్చింది.
- భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి నుంచి భారతీయ రియల్ రంగం బాగా లాభపడింది. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి కల్పన వ్యవస్థగా, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను బలంగా రూపొందించడంలోనూ రియల్ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. 269 పరిశ్రమలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలను కలిగి ఉంది.
- ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అనేది కలగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల దేశంలో హౌసింగ్