Categories: TOP STORIES

జూన్ త‌ర్వాత జూలు విదిల్చేనా?

ఎంపీ ఎన్నిక‌ల కార‌ణంగా మార్కెట్లో ఒడిదొడుకులు నెల‌కొన్న నేప‌థ్యంలో.. జూన్ త‌ర్వాత హైద‌రాబాద్ రియ‌ల్ రంగం జూలు విదిల్చుతుంద‌ని రియ‌ల్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. జూన్ నెల‌లో పిల్ల‌లు స్కూలు, కాలేజీలకు సంబంధించి కొంత బిజీగా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. కాక‌పోతే, ఆత‌ర్వాత.. ఇంటి వేట‌కు దృష్టి సారిస్తార‌ని నిపుణులు అంటున్నారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చే ప్ర‌భుత్వం ఆధారంగా.. హైద‌రాబాద్‌లో ఇన్వెస్ట‌ర్ల పెట్టుబ‌డులు ఉంటాయ‌ని వీరు అంచ‌నా వేస్తున్నారు. అక్క‌డ ఒక‌వేళ జ‌గ‌న్ వ‌స్తే..

పెట్టుబ‌డిదారులు ఎక్కువ‌గా హైద‌రాబాద్ వైపు దృష్టి సారిస్తార‌ని చెబుతున్నారు. అదే, చంద్ర‌బాబు నాయుడు గ‌న‌క ముఖ్య‌మంత్రి అయితే, ఇన్వెస్ట‌ర్లు మొత్తం అమ‌రావ‌తి వైపు చేరుతార‌ని జోస్యం ప‌లుకుతున్నారు. అలాగ‌నీ, హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ వైపు ఎవ‌రూ దృష్టి సారించ‌ర‌ని అనుకోవ‌ద్దు. ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా, హైద‌రాబాద్ రియాల్టీ ఎవ‌ర్‌గ్రీన్ అనే విష‌యాన్ని ఎప్ప‌టికైనా మర్చిపోవ‌ద్దు.

This website uses cookies.