అసలే ఎన్నికల సంవత్సరం కావడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టి హైదరాబాద్ రియల్ రంగం కాస్త నీరసించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు నిర్మాణ రంగంలో భవన నిర్మాణ కార్మికుల కొరత పెరిగింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో.. ఒక్కో సైటులో నుంచి వందలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూర్లకు వెళుతున్నామని ఆయా కార్మికులు చెబుతున్నారు. అయితే, ఓటు వేయడానికి వెళ్లినవారు వారం, పది రోజుల్లో వెనక్కి వచ్చేస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ, కనీసం వారంతా ఒకట్రెండు నెలల దాకా తిరిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదని.. ఫలితంగా, నిర్మాణ పనుల్లో వేగం తగ్గే ఆస్కారముందని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. అసలే అమ్మకాల్లేని సమయంలో కనీసం నిర్మాణ పనుల్లోనైనా ఫోకస్ పెడతామని భావించే డెవలపర్లు కొంత ఇబ్బంది పడే అవకాశముంది.
This website uses cookies.