Categories: TOP STORIES

అల్ట్రా లగ్జరీకి డిమాండ్ ఎక్కువ.. టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ పార్ట్‌న‌ర్ ఆదిత్యా

  • అందుకే ఆ సెగ్మెంట్ ఎంచుకున్నాం
  • రెజ్ న్యూస్ ఇంటర్వ్యూలో
    టీం ఫోర్ లైవ్ స్పేసెస్ పార్ట్‌న‌ర్ ఆదిత్య
హైద‌రాబాద్‌లో అల్ట్రా ల‌గ్జ‌రీ ఫ్లాట్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంద‌ని.. కాక‌పోతే ఫ్లాట్ల స‌ర‌ఫ‌రా కాస్త త‌క్కువ‌గానే ఉంద‌ని టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్‌న‌ర్ ఆదిత్యా తెలిపారు. వెస్ట్ హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ పక్కనే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టును ఆరంభించి అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన సంద‌ర్భంగా రియల్ ఎస్టేట్ గురుకు ఆయ‌న ప్ర‌త్యేక ఇంటర్వ్యూనిచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ.
గత జనవరి 26, 27వ తేదీల్లో మీరు 129 ఫ్లాట్లు అమ్మారని మార్కెట్లో వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎలా సాధ్యమైంది?
ఆదిత్య: మేం మొత్తం ప్రాజెక్టులను తీసుకుని లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, ఉబర్ లగ్జరీ అనే మూడు కేటగిరీలుగా విభజించాం. లగ్జరీ ప్రాడెక్టులంటే 1500 చదరపు అడుగుల నుంచి 2200 చదరపు అడుగుల లోపు తీసుకున్నాం. లగ్జరీ ప్రాడెక్టులు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అందులో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మేం చూసిన థర్డ్ సెగ్మెంట్ ఉబర్ లగ్జరీ.. ఇందులో 5వేల నుంచి 16వేల వరకు.. దానికి అంతే ఉండదు. అల్ట్రా లగ్జరీకి నిర్మాణ వ్యయం ఎక్కువ. 3.3 మీటర్ల హైట్ ఇస్తాం. అన్నీ కార్నర్ ఫ్లాట్లే ఇస్తాం.. ఊహించిన దానికంటే ఎక్కువ అమెనిటీస్‌ను పొందుప‌రుస్తాం. అంటే అవసరానికి కొంత ఎక్కువ ఇస్తాం. వీటికి వ్యయం చేయగలిగినవారే వస్తారు. లగ్జరీకి అప్పు చేసైనా తీసుకుంటారు. అది అవసరం కాబట్టి. ఉబర్ లగ్జరీ అనేది కంప్లీట్ హై.. నిజానికి అది అంత అవసరం లేదు. కేవలం స్టేటస్ కోసం మాత్రమే తీసుకుంటారు. లగ్జరీ సెగ్మెంట్ లో సప్లై ఎక్కువ ఉంది. డిమాండ్ కూడా ఎక్కువ ఉంది.
అదే అల్ట్రా లగ్జరీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. సప్లై మోడరేట్ గా ఉంది. అందుకే ఆ సెగ్మెంట్ ఎంచుకున్నాం. మేం నలుగురు పార్టనర్లు. మా నలుగురికి నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు, బయ్యర్లు కూడా ఉన్నారు. మేం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడే వారి సలహాలు తీసుకున్నాం. వారికి ఏం కావాలి? వారి బడ్జెట్ ఎంత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేశారు. అలాగే ఆ రెండు రోజులు పారదర్శకంగా అన్ని వివరాలూ వెల్లడించి అమ్మిన ఫ్లాట్ అమ్మినట్టుగా బ్లాక్ చేశాం. ఆ పారదర్శకత కూడా అందరికీ నచ్చింది.
మీ ప్రాజెక్టులు టైమ్ లీ డెలివరీ ఇవ్వడానికి, నాణ్యతా ప్రమాణాలు పాటించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఆదిత్య: మా పార్టనర్లలో ఒకరిద్దరు పూర్తి ఫోకస్ తో దాని మీదే పనిచేస్తారు. మా ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచే పూర్తి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాం. మా ప్రాజెక్టుల్లో ఏది చూసినా అవన్నీ మంచి ఎలివేషన్ తో ఉంటాయి. మేం ఎక్కడా ఏ విషయంలోనూ రిస్కు తీసుకోం. ప్రతిరోజూ మా పార్టనర్లలో ఎవరో ఒకరు ప్రాజెక్టు సైట్ లో ఉంటారు. అలాగే మాకు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ టీం కూడా ఉంది. దీనివల్లే మా ప్రాజెక్టుల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉన్నాయి.
వర్చువల్ రియాల్టీలో మా ప్రాజెక్టును కస్టమర్లకు చూపించడం గురించి ఏమైనా ప్లాన్ చేశారా?
ఆదిత్య: వర్చువల్ రియాల్టీ అనేది గుడ్ టెక్నాలజీ.. అయితే, అది ఇప్పుడిప్పుడే వస్తోంది. అది చెప్పడానికి బాగుంటుంది. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మేం దానిమీద పనిచేస్తున్నాం. మేం నైలాకు ఏం చేశామంటే.. ఓ ఫ్లోర్ మొత్తాన్ని మోకబ్ ఫ్లోర్ కింద చేశాం. రెండు వారాల్లో దాన్ని అందుబాటులోకి తెస్తాం. కస్టమర్లు అందరూ వచ్చి వారి ఫ్లాట్ ఎలా వస్తుంది? టైల్స్ ఎలా ఉంటాయి? ఫిక్చర్లు ఎలా కనిపిస్తాయి వంటి అంశాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. అలాగే ఆ ఫ్లోర్ లో ఒకటి మోడల్ ఫ్లాట్ చేశాం.
మాకప్‌ ఫ్లాట్ అనేది గుడ్ కాన్సెప్ట్. మోడల్ ఫ్లాట్ చేస్తారు కానీ ఇలా మాకప్‌ ఫ్లోర్ చేయడం అనేది హైదరాబాద్ లో ఇదే తొలిసారి అయి ఉండొచ్చు. మీ ఆలోచన బాగుంది.

ఆదిత్య: థాంక్యూ.

This website uses cookies.