హైదరాబాద్ నిర్మాణ రంగంలో స్కై విల్లాస్ ట్రెండ్ ఆరంభమైంది. కొన్ని సంస్థలు ఆకాశహర్మ్యాల్లోని టాప్ ఫ్లోర్లలోని రెండు అంతస్తుల్ని స్కై విల్లాలుగా తీర్చిదిద్దుతుండగా.. మరికొన్ని కంపెనీలు ప్రీమియం ఊబర్ లగ్జరీ నిర్మాణాల్ని ఆరంభించి.. కింది నుంచి పైవరకూ స్కై విల్లాస్ తరహాలోనే ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాయి. మరి, ఈ స్కై విల్లాస్ కేవలం వెస్ట్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా… ఈస్ట్ హైదరాబాద్‌కు కూడా విస్తరించిందనే విషయాన్ని మీరు గమనించాలి. మరి, అటు ఎన్ఆర్ఐలు ఇటు బడా సంస్థల్లో ఉన్నత ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు తదితరులెంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్న స్కై విల్లాస్‌పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ స్టోరీ మీకోసం..
స్కై విల్లాస్ ట్రెండ్ హైదరాబాద్‌లో బయ్యర్లను అమితంగా ఆకర్షిస్తోంది. విల్లాస్ అంటే రెండు, మూడు అంతస్తుల్లో కడతారు కదా.. మరి, ఈ స్కై విల్లాస్ ఏమిటని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి, స్కై విల్లాస్‌ని ఆకాశహర్మ్యాల్లో ఎక్కువగా నిర్మిస్తారు. అందులోని పైఅంతస్తుల్లోని రెండు అంతస్తుల్ని కలిపి.. స్కై విల్లాస్‌గా పలు నిర్మాణ సంస్థలు తీర్చిదిద్దుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే.. ప్రాజెక్టు కింది నుంచి పైవరకూ.. ప్రతి ఫ్లాట్‌ను అధిక విస్తీర్ణంలో నిర్మిస్తూ.. వాటిని స్కై విల్లాస్ అని.. సింగిల్ మ్యాన్షన్ విల్లాస్ అంటూ పలు రకాల పేర్లతో మార్కెట్ చేస్తున్నాయి.
నగరానికి చెందిన సాస్ ఇన్‌ఫ్రా.. ఫ్లోరుకో ఫ్లాట్ అంటూ కోకాపేట్‌లో సాస్ క్రౌన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రతి ఫ్లాట్‌ను విల్లా స్థాయిలో డెవలప్ చేస్తామంటూ ప్రకటించింది. తర్వాత శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ కోకాపేట్‌లోనే సొంతాలియా స్కై విల్లాస్‌ను ఆరంభించింది. వాసవి గ్రూప్ ఎల్‌బీనగర్‌లోని వాసవి ఆనంద నిలయం, ఉప్పల్ ఎంఎంటీఎస్ చేరువలోని వాసవి క్రౌన్ ఈస్ట్ వంటి ప్రాజెక్టుల్లో ఈ స్కైవిల్లాస్‌కు స్థానం కల్పించింది. పౌలోమీ సంస్థ తమ పౌలోమీ పలాజోలో అన్నీ ఊబర్ లగ్జరీ ప్రీమియం ఫ్లాట్లను డెవలప్ చేస్తోంది. ఐరిస్ రాఘవ అనే ప్రాజెక్టులోనూ హైఎండ్ ఫ్లాట్లను డిజైన్ చేశారు. తాజాగా, అన్వితా గ్రూప్ కొల్లూరులోని అన్వితా హై నైన్ ప్రాజెక్టులో స్కై విల్లాస్‌కు శ్రీకారం చుట్టింది. మొత్తానికి, ఈ స్కై విల్లాస్ ఊబర్ ప్రీమియం లగ్జరీ ఫ్లాట్లు కావాలని కోరుకునేవారికి అమితంగా నచ్చుతుంది. అందుకే, వీటికి ఎక్కడ్లేని ఆదరణ లభిస్తోంది.
This website uses cookies.