ఏపీలో భూముల రీసర్వే.. ప్రజలంతా సంతృప్తి చెందేలా ఉండాలని, ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వేలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావడమే రీసర్వే లక్ష్యమని పేర్కొన్నారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై సమీక్ష చేసిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. దాదాపు వందేళ్ల తర్వాత చేస్తున్న ఈ భూముల సర్వేలో ఎలాంటి తప్పిదం జరగకూడదన్నారు. ఎవరూ వేలెత్తి చూపని విధంగా సర్వే జరగాలని నిర్దేశించారు. దోషాలు, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదని తేల్చిచెప్పారు. మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో చేపట్టే సర్వేను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సూచించారు.
This website uses cookies.