Categories: LATEST UPDATES

పీఈ పెట్టుబడుల్లో భారీ క్షీణత

  • తొలి త్రైమాసికంలో 95 శాతం తగ్గుదల

భారతదేశ రియల్టీ రంగంలో ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల్లో భారీ క్షీణత నమోదైంది. పెరుగుతున్న మాంద్యం ముప్పు, పెరుగుతున్న మూలధన వ్యయాలు, అమ్మకందారులు, పెట్టుబడిదారుల మధ్య విలువల అంచనాలలో అసమతుల్యత కారణంగా పీఈ పెట్టుబడులు 2023 తొలి త్రైమాసికంలో ఏకంగా 95 శాతం తగ్గాయి.

ఈ ఏడాది క్యూ1లో కేవలం 0.05 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.370 కోట్లు) పీఈ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది 95 శాతం తక్కువ. ఈ పరిస్థితి దేశంలో మూలధన విస్తరణకు అవరోధాలుగా మారాయని సావిల్స్ నివేదిక పేర్కొంది. అయితే, కోర్ ఆఫీస్, కోర్ రిటైల్, వేర్ హౌసింగ్, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ లో పెట్టుబడులు పెట్టాలనే డిమాండ్ చాలా బలంగా ఉందని సావిల్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ దివాకర్ రాణా తెలిపారు. భారతీయ రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడులకు భారీ అవకాశాలు అందిస్తుందని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త పెట్టుబడి ఫార్మాట్లతో గణనీయమైన రాబడి అందిస్తుందని పేర్కొన్నారు

This website uses cookies.