Categories: PROJECT ANALYSIS

ప్రకృతిలో నివాసానికి.. కదంబ ఫారెస్ట్

  • శంషాబాద్-తుక్కుగూడలో ఆధునిక అపార్టుమెంట్లు

హైదరాబాద్ నగరానికి దగ్గరగా.. అదే సమయంలో ఆ రణగొణ ధ్వనులు, కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి ఒడిలో విశాలమైన, విలాసవంతమైన అపార్ట్ మెంట్లో నివసించాలని ఉందా? అయితే, శంషాబాద్-తుక్కుగూడలో అద్భుతంగా నిర్మితమవుతున్న కదంబ ఫారెస్ట్ లో రైజ్ అపార్ట్ మెంట్ ఎంచుకుంటే.. మీ కోరిక తీరినట్లే. 3.15 ఎకరాల స్థలంలో 2, 3 బీహెచ్ కే లగ్జరీ అపార్ట్ మెంట్లు సిద్ధమవుతున్నాయి. కరోనా వంటి మహమ్మారిలను ఎదుర్కొనేలా డబ్ల్యూహెచ్ ఓ ప్రమాణాల మేరకు ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

చుట్టూ 18 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మహేశ్వరం అడవి కారణంగా ప్రకృతి ఒడిలో సేద తీరిన అనుభూతి కలుగుతుంది. అన్ని వయసులవారికీ అవసరమైన పలు సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన బహిరంగ ప్రదేశాలు ఉండేలా ప్రాజెక్టు డిజైన్ చేయడం వల్ల స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ప్లే అండ్ గ్రో పిల్లల ఆటస్థలం, పెద్దలు పిచ్చాపాటీ మాట్లాడుకోవడానికి రచ్చబండ తరహా ఏర్పాటు, గెజిబో సిట్టింగ్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో నివసిస్తే పిల్లలు ప్రకృతితో మమేకమవుతారు. పెద్దలు కాలుష్యానికి దూరంగా ఉంటారు. అటు పని, ఇటు జీవితం రెండింటి మధ్య చక్కని సమతుల్యత ఉంటుంది.

వంద టన్నుల స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేసే ఆకులు, పొదలు, చెట్లు, లతలను చుట్టూ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టులో జీవితం అదిరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు వ్యవసాయ పచ్చిక బయళ్లు, మరోవైపు 18 వేల ఎకరాల తుక్కుగూడ-లేమూర్ రిజర్వ్ డ్ ఫారెస్ట్ ఉండటం వల్ల భవిష్యత్తులో సైతం అక్కడ హైరైజ్ అపార్ట్ మెంట్లు వచ్చే అవకాశమే లేదు. అంటే.. ఎప్పటికీ అదే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతమైన జీవితం గడపొచ్చన్నమాట. 24 గంటల సెక్యూరిటీతో నిర్మితమవుతున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ.. గోద్రేజ్ సర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్టు కావడం విశేషం. కామన్ ఏరియాల్లో సౌర విద్యుత్ వినియోగం, జీరో వాటర్ వేస్టేజ్, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, గ్రిన్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ వంటివి ఎన్నో ఉన్నాయి. రవాణాపరంగా కూడా చక్కని కనెక్టివిటీ కలిగిన ప్రాంతం కావడం మరో విశేషం. తుక్కుగూడ-శ్రీశైలం రోడ్డు హైదరాబాద్ లో అత్యుత్తమమైన, అత్యంత ఆశాజనకమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

శంషాబాద్-తుక్కుగూడ-ఆదిబట్ల గోల్డెన్ ట్రయాంగిల్ లో భాగంగా మౌలిక వసతులు వేగంగా రానున్నాయి. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. అలాగే ఫ్యాబ్, ఈ సిటీకి ఐదు నిమిషాలు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, రాబోయే వరల్డ్ ట్రేడ్ సెంటర్, హార్డ్ వేర్ పార్కు, ఆదిబట్ల ఐటీ ప్రాజెక్టులకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 25 నిమిషాల సమయం పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే సైట్ విజిట్ చేసి ప్రశాంతమైన జీవితానికి కదంబ ఫారెస్ట్ తలుపులు తెరవండి.

This website uses cookies.