భారతదేశపు అగ్రగామి అగ్రి స్టార్టప్ నింజాకార్ట్ బెంగళూరులోని ఇండిక్యూబ్ లో వెయ్యి సీటర్ ప్రీమియం ఆఫీస్ స్పేస్ తీసుకుంది. రియల్ రంగంలో ప్రముఖ సంస్థ కొలియర్స్ ఈ లావాదేవీ నిర్వహించింది. నింజాకార్ట్ గత ఎనిమిదేళ్లుగా వ్యవసాయ సరఫరా గొలుపు ప్రక్రియ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. దీని ద్వారా రైతులు, వ్యాపారులు, చిల్లర వర్తకులు, దిగుమతిదారులకు, ఎగుమతిదారులకు సాధికారత లభించింది. స్థిరమైన మార్కెట్ నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నింజాకార్ట్ తన కార్యాలయ స్థలాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కొలియర్స్ ఇండియాను నియమించింది. ఖర్చు, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని కొలియర్స్ నిపుణులు సంప్రదాయ ఆఫీస్ స్పేస్ కంటే మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ మంచిదని ప్రతిపాదించారు. అనంతరం అన్ని అంశాలూ పరిశీలించి ఔటర్ రింగు రోడ్డు కారిడార్ లో ఇండిక్యూబ్ నిర్వహిస్తున్న ప్రీమియం మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ను ఖరారు చేశారు. ఇక్కడ జిమ్ తోపాటు పిల్లల సంరక్షణ సౌకర్యాలు, ఫుడ్ కోర్టు వంటి బోలెడె సౌకర్యాలు ఉన్నాయి. త్వరలో రాబోయే మెట్రో రైల్ కు ఇది సమీపంలోనే ఉంది. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న తాజా ఉత్పత్తుల మార్కెట్ ప్లేస్ నిజాంకార్ట్.. తన కార్యకలాపాలు మరింత మెరుగ్గా సాగించడానికి ఇండిక్యూబ్ సరైన స్థలమని మేం భావించాం. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది. అటు ఉద్యోగి, ఇటు క్లయింట్ కు అవసరమైన సౌకర్యాలు కలిగి ఉంది. అందువల్లే దీనిని ఎంపిక చేశాం’ అని కొలియర్స్ సౌత్ అండ్ ప్లెక్స్ ఇండియా హెడ్ ఆఫ్ సర్వీసెస్ ఎండీ అర్పిత్ మహోత్రా తెలిపారు. ‘కొలియర్స్ సూచించిన ఇండిక్యూబ్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉంది’ అని నింజాకార్ట్ సహ వ్యవస్థాపకుడు శరత్ లోగనాథన్ పేర్కొన్నారు.
This website uses cookies.