Categories: LATEST UPDATES

హైదరాబాద్ లో జోరుగా రిజిస్ట్రేషన్లు

భాగ్యనగరంలో రెసిడెన్షియల్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. గతనెలలో ఒక్క హైదరాబాద్ లో 5,787 రెసిడెన్షియల్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది అక్టోబర్ తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఇక గత నెలలో రిజిస్ట్రేషన్లు జరిగిన ఆస్తుల మొత్తం విలువ రూ.3,170 కోట్లు. ఇది గతేడాది అక్టోబర్ కంటే 41 శాతం ఎక్కువ. ఈ ఏడాది అక్టోబర్ లో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన ఇళ్లు అధికంగా ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 50 శాతం. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా నమోదైంది. గతేడాది అక్టోబర్ తో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ కావడం గమనార్హం. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 10 శాతంగా ఉంది. ఇది గతేడాది 8 శాతం ఉండగా.. ఇప్పుడు 2 శాతం పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే.. వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ల వాటా 69 శాతంగా నమోదైంది. అలాగే 500 చదరపు అడుగుల నుంచి వెయ్యి చదరపు అడుగుల మధ్య ఉండే చిన్న ఇళ్ల వాటా గతేడాది 21 శాతం ఉండగా.. ఈ అక్టోబర్ లో 16 శాతానికి పడిపోయింది. అయితే, 2వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్ల వాటా 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ఇళ్ల విక్రయాల రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్ గిరి 43 శాతంతో తొలి స్థానంలో ఉండగా.. రంగారెడ్డి 42 శాతంతో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

This website uses cookies.