Categories: LATEST UPDATES

నిర్మాణాలపై రూ.900 నుంచి 1100

రిజిస్ట్రేషన్ శాఖ తాజా నిర్ణయం

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ నిర్మాణాలకు సంబంధించిన మార్కెట్ విలువను పక్కాగా అంచనా వేసేందుకు.. ఫ్లాట్లు, వ్యక్తిగత భవనాల స్ట్రక్చర్ ధరల్ని సవరించింది. ఈ తాజా నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఆర్ సీసీ నిర్మాణానికి రూ.1100 వసూలు చేస్తారు. ఆర్ సీసీ కానీ నిర్మాణమైతే రూ.750గా నిర్ణయించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 900 మరియు రూ.600గా నిర్ణయించారు. ఇందులో స్థలం విలువను లెక్కించరని గుర్తుంచుకోండి.

నిర్మాణంలో ఉన్న వాటి మీద మూడు రకాలుగా రేట్లను లెక్కిస్తారు. పునాది స్థాయి అయితే 25 శాతం, శ్లాబు లెవెల్ అయితే 65 శాతం, ఫినిషింగ్లో ఉన్నట్లయితే 85 శాతం లెక్కిస్తారు. స్ట్రక్చర్ డిప్రిసియేషన్ విషయానికొస్తే పదేళ్లలోపు ఎలాంటి తరుగుదల ఉండదు. పదేళ్లు దాటిన నిర్మాణాలపై ఒక శాతం డిప్రిసీయేషన్ లెక్కిస్తారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

This website uses cookies.