Categories: LATEST UPDATES

పంచాయ‌తీల్లో రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు .. 2 శాతం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయ‌తీల్లో ఇక నుంచి రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు రెండు శాతం వ‌సూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన జీవో నెం.60ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. తాజా నిబంధ‌న జులై 22 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంది. సాధారణంగా, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రిజిస్ట్రేష‌న్ ఛార్జీ అర శాత‌మే వ‌సూలు చేస్తారు. కాక‌పోతే, 1.5 శాతం రుసుమును ట్రాన్స్‌ఫ‌ర్ డ్యూటీ పేరిట తీసుకుంటారు. గ్రామ‌ పంచాయ‌తీల్లో ట్రాన్స్‌ఫ‌ర్ డ్యూటీని వ‌సూలు చేసే అవ‌కాశం లేనందు వ‌ల్ల‌.. రెండు శాతం రిజిస్ట్రేష‌న్ ఛార్జీల్ని వ‌సూలు చేస్తార‌ని సమాచారం. ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం వ‌ల్ల పంచాయ‌తీల్లో ఇంటి రిజిస్ట్రేష‌న్ కొంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారుతుంది.

This website uses cookies.