Categories: EXCLUSIVE INTERVIEWS

ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్ని ప్రత్యేక జోన్ చేయాలి

Kacham Rajeshwar
* ఆ జీవో ఎత్తివేత వల్ల 84 గ్రామాల ప్రజలకు మంచి లాభం
* శ్రీ సాయి కృప వెంచర్స్ ఎండీ కాచం రాజేశ్వర్

ట్రిపుల్ వన్ జీవో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ చేయాలని, తద్వారా ఆ ప్రాంతాన్ని పరిరక్షించడానికి వీలువుతుందని శ్రీ సాయి కృప వెంచర్స్ ఎండీ కచం రాజేశ్వర్ తెలిపారు. ఈ జీవో ఎత్తివేయడం వల్ల ఎవరికీ నష్టం లేదని స్పష్టంచేశారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల దాని పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజల బాగా లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ జీవో ఎత్తివేత, ఇతరత్రా అంశాలపై రియల్ ఎస్టేట్ గురుతో రాజేశ్వర్ మాట్లాడారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం అనేది ఎన్నికల హమీల్లో ఒకటి. ఎన్నికలు దగ్గరకొచ్చాయి కాబట్టి ఇది చేశారు. అయితే, దీనివల్ల పర్యావరణానికి మాత్రం కాస్త నష్టం కలుగుతుంది. వికారాబాద్ నుంచి చెవెళ్ల, గండిపేట వరకు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ వన్ జీవో ఏరియాను ప్రత్యేక జోన్ చేసి ఉంటే బాగుంటుంది. గ్రీనరీ ఎక్కువ ఉన్న ఏరియాలో ఉంటే బాగుంటుంది. హైదరాబాద్ ను చూస్తే వెస్ట్ లో ఈ ఏరియా ఉండగా.. ఈస్ట్ లో శామీర్ పేటను కూడా కన్జర్వేషన్ జోన్ గా ప్రకటించారు. రెండు వైపులా ఇలా ఉండాలి. అప్పుడు అర్బన్ ఫలాలను గ్రామాలకు ఇచ్చినట్టు ఉండేది. అదే సమయంలో గ్రీనరీని కాపాడినట్టుగా ఉంటుంది. దానిని పొగొట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఇక హైరైజ్ అపార్ట్ మెంట్ల విషయానికి వస్తే నిర్మాణ వ్యయం రూ.3500 నుంచి రూ.4వేల వరకు ఉంది. అదే భూమి విలువ, ఇతరత్రా అంశాలు కలుపుకొంటే ఇది రూ.6500 నుంచి 7500 వరకు అవుతుంది.

హైదరాబాద్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ టీం బాగా పని చేశారు. అన్ని రంగాలకూ పెట్టుబడులు వచ్చాయి. ఇది ట్రెయిలర్ మాత్రమే.. హైదరాబాద్ డెవలప్ మెంట్ ఇంకా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 30 శాతమే అర్బనైజేషన్ పూర్తయింది. 2032 నాటికి 50 శాతం దాటుందని అంచనా. హైదరాబాద్ కు వలసలు కూడా పెరిగాయి. గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో రియల్ కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నాం. హైరైజ్ అపార్ట్ మెంట్స్ ఎవరు కొంటారని ప్రశ్నిస్తారు. కానీ కట్టేవాళ్లు కడుతూనే ఉన్నారు.. కొనేవారు కొంటూనే ఉన్నారు.. పూర్తయిన ఏ వెంచర్ లోనూ ఖాళీలు లేవు. మన దగ్గర ఉన్న పాలసీ వల్లే హైరైజ్ అపార్ట్ మెంట్లు వచ్చాయి. పదేళ్లలో నగరం భారీగా అభివృద్ధి చెందింది. రజనీకాంత్ వంటివారు కూడా హైదరాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఇంత మంచి ఇన్ ఫ్రాస్టక్చర్ ఉంది కాబట్టి ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసినంత మాత్రాన వేరే చోట నష్టం కలగదు. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతం అభివృద్ధి చెందడానికి కాస్త సమయం తీసుకుంటుంది. అప్పటివరకు నగరంలోని ఇతర చోట్ల ధరలు తగ్గిపోతాయని అనుకోవడంలేదు’ అని రాజేశ్వర్ పేర్కొన్నారు.

This website uses cookies.