Categories: LATEST UPDATES

లేటెస్ట్ అప్డేట్: 143 అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత

  • టాస్క్ ఫోర్స్ దూకుడు
  • గత మూడు రోజుల్లో 24 అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

రియ‌ల్ ఎస్టేట్ గురు, హైదరాబాద్: గ‌త కొంత‌కాలం నుంచి హెచ్ఎండీఏ కూల్చివేస్తున్న అక్ర‌మ క‌ట్ట‌డాల్ని చూస్తుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్‌, విజిలెన్స్ వంటి అధికారులు ఎంత మొద్దునిద్ర‌లో ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. గురువారం సాయంత్రం నాటికి దాదాపు 143 అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేశారు. ఇంకా, ఎంత‌మంది డెవ‌ల‌ప‌ర్లు ఈ అధికారుల్ని మేనేజ్ చేస్తున్నారో తెలియ‌ద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఏదీఏమైనా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ దూకుడు పెంచింది.

డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ బృందాలు గురువారం మూడు మున్సిపాలిటీల పరిధిలో పది (10) అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నాయి. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో అరు (6), పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో మూడు (3), దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకటి (1) చొప్పున టాస్క్ ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి. గతంలో దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా వాటిలో ఒక నిర్మాణాన్ని తిరిగి నిర్మిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో మేడ్చల్ మల్కాజ్ గిరి అడిషనల్ కలెక్టర్, హెచ్ఎండిఎ డైరెక్టర్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ లు స్వయంగా పరిశీలించి సదరు నిర్మాణం పిల్లర్లను దగ్గరుండి కూల్చి వేయించారు.

This website uses cookies.