మొహలీలో ప్లాట్ల అమ్మకాల పేరుతో 29 మందిని రూ.7 కోట్ల మేర మోసం చేసిన కేసులో జీబీపీ గ్రూప్ పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ గ్రూప్ పై 13 కేసులు నమోదు కాగా, తాజాగా 14వ కేసు నమోదు కావడం గమనార్హం. సెక్టార్ 20కి చెందిన దర్మియాన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
జీబీపీ ప్రైవేటు లిమిటెడ్ కి చెందిన గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ డైరెక్టర్లు సతీశ్ గుప్తా, రమణ్ గుప్తా, ప్రదీప్ గుప్తా, అనుపమ్ గుప్తాలు ముల్లాన్ పూర్ స్మార్ట్ సిటీలో ప్లాట్ల అమ్మకాల పేరుతో తమను 2018-19లో రూ.7 కోట్ల మేర మోసం చేశారని దర్మియాన్ సింగ్ తోపాటు మరో 28 మంది ఫిర్యాదుదారులు ఆరోపించారు. తమ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ప్లాట్లు అప్పగించలేదని, తాము చెల్లించిన సొమ్ము కూడా వెనక్కి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గత నెల 22న నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మరో కేసు నమోదు చేశారు.
This website uses cookies.