Categories: LATEST UPDATES

పది ఎకరాలకు రూ.235 కోట్లు

    • కూకట్ పల్లిలో భూమి కొనుగోలు చేసిన అశోకా బిల్డర్స్

అశోకా బిల్డర్స్ ఇండియా సంస్థ (ఏఎస్ బీఎల్) హైదరాబాద్ కూకట్ పల్లిలో పది ఎకరాల భూమిని రూ.235 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు ఈ లావాదేవీలో భాగస్వామిగా వ్యవహరించిన జేఎల్ఎల్ సంస్థ వెల్లడించింది. ఈ భూమికి ఏఎస్ బీఎల్ అతిపెద్ద బిడ్డర్ గా నిలించిందని పేర్కొంది. బహుళ ప్రయోజన ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ భూమిని కొనుగోలు చేసినట్టు ఏఎస్ బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు తెలిపారు. ‘అక్కడ ప్రీమియం రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్ ను 2025 జూన్ నాటికి అభివృద్ధి చేస్తాం. ఈ బహుళ ప్రయోజన ప్రాజెక్టు అభివృద్ధి కోసం మరో రూ.250 కోట్లు వెచ్చించనున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాని విలువ సుమారు రూ.600 కోట్లకు చేరుతుంది’ అని వివరించారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది తమ తొలి వెంచర్ అని పేర్కొన్నారు. అటు వాణిజ్యపరంగా, ఇటు నివాసపరంగా రెండింటిలోనూ హైదరాబాద్ మార్కెట్ తారాపథంలో దూసుకుపోతోందనడానికి ఈ ఒప్పందమే నిదర్శనమని జేఎల్ఎల్ (తెలంగాణ, ఏపీ) ఎండీ సందీప్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఏఎస్ బీఎల్ దాదాపు 5 మిలియన్ చదరపు అడుగుల మేర నివాస గృహాలను నిర్మిస్తోంది.

This website uses cookies.