హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నిర్వహిస్తున్న ఎల్అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ భారీ మొత్తంలో నిధులు సేకరించింది. బాండ్లు, వాణిజ్య పత్రాలు (సీపీలు) విక్రయించడం ద్వారా రూ.13,119 కోట్లు సమీకరించింది. కేవలం ఒక్కరోజులో ఇంత మొత్తం నిధులు సేకరించడం విశేషం. ఒక్కోటీ రూ.2,872 కోట్లు విలువ చేసే మూడు బాండ్లను విక్రయించింది. ఇవి మూడేళ్ల నాలుగు నెలలు, నాలుగేళ్ల నాలుగు నెలలు, ఐదేళ్ల నాలుగు నెలల కాలావధి కలిగి ఉన్నాయి. అలాగే మూడు, ఆరు, తొమ్మిది, 12 నెలల కాలావధి కలిగిన నాలు సెట్ల సీపీలను కూడా కంపెనీ విక్రయించింది. ఇప్పటివరకు బాండ్ల ద్వారా రూ.8,600 కోట్లు, సీపీల ద్వారా దాదాపు రూ.5వేల కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ నిధుల సేకరణలో ఎస్ బీఐ కేపిటల్ మార్కెట్ సహాయ సహకారాలు అందించింది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ఈ కంపెనీ.. తమ నిధుల వ్యయాన్ని కనీసం 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. భారంగా మారిన బ్యాంకు రుణాలను ఈ మొత్తంతో తీర్చనుంది.
This website uses cookies.