మహారాష్ట్రలో నిలిచిపోయిన ప్రాజెక్టు సంఖ్య భారీగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,809 ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.78వేల కోట్ల విలువైన 1.28 ఫ్లాట్లు ఆ కేటగిరీలో ఉన్నాయని తేలింది. పుణెలో అత్యధికంగా 834 ప్రాజెక్టులు నిలిచిపోయి ఉండగా.. తర్వాతి స్థానంలో ముంబై (582), థానే (354) ఉన్నాయని మహారాష్ట్ర రెరా తెలిపింది. 2017 నుంచి 2022 మార్చి లోగా పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
అదనపు గడువు కావాలని బిల్డర్లు కోరకపోవడం.. బుకింగ్స్ పూర్తి చేయకపోవడంతో వీటిని ‘ఆగిపోయిన’ కేటగిరీలో పెట్టారు. కాగా, వీటిలో కొనుగోలు చేసిన వారెవరూ ఇబ్బందులు పడకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మహారెరా అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తంచేశారు. ఆగిపోయిన ప్రాజెక్టుల అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.
This website uses cookies.