Categories: LATEST UPDATES

గృహ రంగానికి గడ్డు రోజులు!

  • వచ్చే ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి
  • పీఎన్ బీ వార్షిక నివేదికలో వెల్లడి

గత కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో కొటుమిట్టాడుతున్న దేశీయ గృహ రంగం దూసుకుపోయే సమయం వచ్చిందని, వచ్చే ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ అభిప్రాయపడింది. రెరా, జీఎస్టీ వంటి అంశాలతో మరింత పారదర్శకత వచ్చిన నేపథ్యంలో రాబోయే కాలం నిర్మాణ రంగానికి బాగుంటుందని 2021-22 వార్షిక నివేదికలో పేర్కొంది.
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని తెలిపింది.

పలు సంవత్సరాల తర్వాత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో చక్కని వృద్ధి సాధించే అవకాశం కనిపిస్తోంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలే దీనిని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. తమ పెట్టుబడుల విషయంలో వినియోగదారులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో హౌసింగ్ రంగం చక్కని సుస్థిరత కనబరుస్తుందనే విశ్వాసం ఉంది’ అని పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈవో హర్ దయాల్ ప్రసాద్ పేర్కొన్నారు. కరోనా సహా పలు సవాళ్లను ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందన్నారు. రెరా, జీఎస్టీ వంటి వాటి అమలు కారణంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత మరింత పెరిగిందని తెలిపారు. వీటితోపాటు ఉత్పాదకత ఆధారిత ఇన్సెంటివ్ పథకం (పీఎల్ఐ) తీసుకురావడం వల్ల భారత్ తయారీ హబ్ గా అవతరించనుందని అభిప్రాయపడ్డారు.

This website uses cookies.