కర్ణాటక రెరా జారీ చేసిన రికవరీ ఆర్డర్లలో ఇంకా 88 శాతం పెండింగ్ లోనే ఉన్నాయని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. మొత్తం 1539 కేసుల్లో రూ.707 కోట్ల విలువైన రికవరీ ఆర్డర్లను కే రెరా జారీ చేసింది. ఇందులో ఇప్పటికీ 88 శాతం పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపింది. రెవెన్యూ రికవరీని వేగవంతం చేయడానికి సంబంధిత యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్టు కే రెరా చైర్మన్ రాకేశ్ సింగ్ తెలిపారు. ఆగస్టు 31 నాటికి, 185 కేసుల్లో రూ.79.94 కోట్ల మేర పరిహారం రికవరీ అయినట్లు సమాచారం.
ఇంకా 1,354 కేసుల్లో రూ.627.32 కోట్లకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రికవరీని వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టినట్టు రాకేశ్ సింగ్ వెల్లడించారు. సంబంధిత అధికారులు మరింతగా ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారమే తన ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
This website uses cookies.