- కొనుగోలుదారుల ఫిర్యాదుల్లో 90 శాతం పరిష్కారం
కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడే విషయంలో దేశంలోని మిగిలిన రెరాల కంటే కాస్త ముందున్న రాజస్థాన్ రెరా.. మరోసారి వార్తల్లో నిలిచింది. కొనుగోలుదారుల నుంచి ఈ ఏడాది అందిన ఫిర్యాదుల్లో దాదాపు 90 శాతం ఫిర్యాదులను పరిష్కరించింది. ఈ ఏడాది దీపావళి వరకు ఇళ్ల కొనుగోలుదారుల నుంచి 1484 ఫిర్యాదులు అందగా.. వాటిలో 89.93 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు రాజస్థాన్ రెరా అధికారి ఒకరు తెలిపారు.
ఫిర్యాదుల పరిష్కారంలో తాము దేశంలో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడించారు. కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజస్థాన్ రెరా శెభాష్ అనిపించుకుంటోంది. మరి ఇలాంటి విషయాల్లో తెలంగాణ రెరా పరిస్థితి ఏమిటి? కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్ర రెరా ఏ స్థానంలో ఉంది వంటి విషయాలను అధికారులు వెల్లడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.