poulomi avante poulomi avante

ప్రాజెక్టుల తనఖా స్థితి ప్రకటించాలి

  • రియల్ ఎస్టేట్ డెవలపర్లకు మహారాష్ట్ర రెరా ఆదేశం

మహారాష్ట్రలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి మరింత పాదర్శకత తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర రెరా కీలక నిర్ణయం తీసుకుంది. డెవలపర్లు తమ ప్రాజెక్టుల తనఖా స్థితి ఏమిటనే విషయాన్ని వెంటనే ప్రకటించాలని ఆదేశించింది. తద్వారా కొనుగోలుదారులు తాము కొనాలని భావిస్తున్న ప్రాజెక్టుపై ఏవైనా రుణాలు ఉన్నాయో లేవో తెలుసుకునే వీలుంటుందని పేర్కొంది. వాస్తవానికి ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (సెర్సాయ్) వద్ద ఉంటుంది.

 

ఒకే ప్రాపర్టీపై పలు బ్యాంకులు నుంచి రుణాలు తీసుకోకుండా నిరోధించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. 2017 జూన్ నుంచి దీనికి సంబంధించిన డేటాను సెర్సాయ్ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో కొనుగోలుదారులు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా చూసేందుకు మహారాష్ట్ర రెరా దీనిపై నిర్ణయం తీసుకుంది. చాలా సందర్భాల్లో కొనుగోలుదారులు తమ ప్రాజెక్టు తనఖా స్థితి గురించి తెలుసుకోకుండా కొంటున్నారని.. అనంతరం చిక్కుల్లో పడుతున్నారని పేర్కొంది. ఒకవేళ డెవలపర్ ఆ ప్రాజెక్టును బ్యాంకుకు తనఖా పెట్టి రుణం పొంది తీర్చకపోతే.. వాటిని కొనుగోలుచేసినవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాజెక్టు తనఖా స్థితి ఏమిటి? ఆ ప్రాజెక్టు లేదా అందులోని కొన్ని ఫ్లాట్లపై డెవలపర్ ఏమైనా రుణం తీసుకున్నాడా అనే విషయాన్ని ముందుగానే తెలియజేయాలని రెరా స్పష్టంచేసింది. సెర్సా నుంచి ఈ మేరకు తగిన వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles