- జాన్వీ కపూర్ ఇంటి విశేషాలివీ..
అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధర్మ ప్రొడక్షన్స్ చిత్రంలో ఆమె మొదటి పాత్ర పోషించినప్పటి నుంచి ఇప్పటివరకు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వర్థమాన హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. జాన్వీ ముంబైలో ఓ ఖరీదైన ట్రిప్లెక్స్ కొనుగోలు చేశారు. మహారాష్ట్రలో స్టాంపు డ్యూటీ 2 శాతం మాత్రమే ఉన్న సమయంలో రూ.39 కోట్లు వెచ్చించి ఈ కొనుగోలు జరిపినట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు రాజభవనం వంటి ఇళ్లను కలిగి ఉన్న జుహూ విలే పార్లేలోనే జాన్వీ కొత్త ఇల్లు ఉంది. క్లాసీ లుక్ తో, మంచి వ్యూతో అదిరిపోతుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ లో ఉన్న సమయంలో కపూర్ సిస్టర్స్ ఇన్ స్టాగ్రామ్ లో సరదా వీడియోలు పోస్ట్ చేశారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సరదాగా గడుపుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. తన వ్యక్తిగత స్పేస్ కు, కుటుంబానికి థాంక్స్ చెబుతూ జాన్వీ ఓ నోట్ కూడా పెట్టారు.
జాన్వీ ఇంటికి సంబంధించి లివింగ్ రూమ్ తో ప్రారంభిస్తే.. అతిథులకు స్వాగతం పలికే ఆ ప్రదేశంలో ఐవరీ, క్రీమ్, టాన్ షేడ్స్ ఉన్నాయి. నిగనిగలాడే మార్బుల్ ఫ్లోరింగ్.. ఆ మొత్తం ప్రదేశానికి అదిరిపోయే లుక్ తీసుకొచ్చింది. గోడలపై కళాకృతులతో కూడిన గంభీరమైన షాండ్లియర్లు, అద్దాలు, కొన్ని డేకరేషన్ పీసెస్ ఆ రూమ్ కి మరింత వన్నె తెచ్చాయి. కపూర్ కుటుంబం తమ రెండు పెంపు శునకాలతో ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంది. ఇంకా ఆ ఇంట్లో గమనించతగ్గ అంశం ఏమిటంటే.. లోపల అనేక బుద్ధ శిల్పాలు, గదుల్లో పచ్చదనం కనిపిస్తాయి. ఇక డైనింగ్ ఏరియా చూస్తే.. పైన అందమైన గాజు షాండ్లియర్ ఉంటుంది. ఆ గది తెలుపు, లేత గోధుమరంగులతో నిండి ఉంది. లివింగ్ రూమ్ డెకర్ కు కొనసాగింపుగా ఇది కనిపిస్తుంది. డిన్నర్ ఏరియాకు సంబంధించి కొన్ని చిత్రాలను శ్రీదేవి అప్పట్లో పంచుకున్నారు. అందులో ఖుషీ తన రెండు పిల్లలను దగ్గరకు తీసుకోవడం కనిపిస్తుంది.
కపూర్ సిస్టర్స్ ని మీరు ఫాలో అయితే, వారు తీయించుకున్న ఔట్ ఫిట్ ఆఫ్ ది డే (ఓఓటీడీ) చిత్రాల్లో చాలామటుకు ఆ ఇంట్లోని మూలల్లోనే అనే సంగతి గుర్తుపడతారు. జాన్వీ ఎక్కువగా లివింగ్ రూమ్ లోనే ఫొటో షూట్ చేస్తుంటారు. లివింగ్ రూమ్ కు పొడిగింపుగా ఉన్న ఆ స్పేస్ బ్యాక్ గ్రౌండ్ లో పియానో, గోల్డెన్ అద్దం అందంగా కనిపిస్తాయి. జాన్వీ కుటుంబ పోర్టయిట్ తోపాటు కొన్ని ఎంపిక చేసిన ఫొటోలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అక్కడ ఉన్న బోలెడు ఖరీదైన కళాఖండాల మధ్యలో సోఫా పైన గోల్డెన్ ఫ్రేమ్ లో ఒక నల్లటి పెయింటింగ్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పెయింటింగ్ వేసింది శ్రీదేవి. ఇక జాన్వీ ఇంట్లో తప్పనిసరిగా చూడాల్సిన మరో ప్రదేశం ఆమె డ్రెస్సింగ్ రూమ్. ఇందులో వాక్ ఇన్ వార్డ్ రోబ్ ఉంది. అందులో డిజైనర్ డ్రెస్సులతోపాటు తప్పనిసరిగా వేసుకునే దుస్తులు ఉన్నాయి. అలాగే షూ కలెక్షన్ తోపాటు పెర్ ఫ్యూమ్ లతో కూడిన పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది. జాన్వీ రోజువారీ అవసరాలకు సరిపోయేలా పూర్తిగా తెల్లటి ఇంటీరియర్ తో కూడిన ఆ గదిలోకి చక్కని వెలుతురు కూడా వస్తోంది.