అథియా శెట్టి.. 2015లో హీరో సినిమాతో అరంగేట్రం చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి, ఆయన భార్య మనా శెట్టిల కుమార్తె అయినా అథియా.. చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగి ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అయితే, అదే ఆమె అర్హతగా భావించలేదు. ఎంతో సహజమైన నటన కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. 2015లో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మించిన హీరో చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కొత్తగా వచ్చినప్పటికీ, ఆమె దృఢ సంకల్పం, స్వతంత్ర వ్యక్తిత్వంతో అందరి దృష్టి ఆకర్షించారు. ఈ క్రమంలోనే పరిశ్రమలో అందరూ గుర్తుంచుకోతగ్గ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె గాంభీర్యం, ఫ్యాషన్ సెన్స్, సాపేక్షమైన వ్యక్తిత్వం కలిసి ఆమెను తెరపైనే కాకుండా సోషల్ మీడియా, బ్రాండ్ ఎండార్స్ మెంట్ ప్రపంచంలో కూడా ప్రముఖ వ్యక్తిగా మార్చాయి.
అథియా శెట్టి కలల నివాసం ఖండాలాలోని సుందరమైన కొండలలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ప్రకృతితో విలాసాన్ని మిళితం చేసిన స్వర్గధామంలా కనిపిస్తుంది. 6,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన విల్లా అద్భుతంగా ఉంటుంది. ఓపెన్ స్పేస్, కొండల నుంచి వీచే గాలులతో నగర జీవితంలోని రణగొణ ధ్వనుల నుంచి పరిపూర్ణంగా తప్పించుకునేలా ఆమె విల్లా ఉంటుంది. ఇంట్లోని ప్రతి అంగుళం ప్రశాంతమైన వాతావరణానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అథియా శెట్టి విల్లాలో ఐదు విశాలమైన బెడ్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి బెడ్ రూమ్ వ్యూ చుట్టూ ఉన్న పచ్చదనం కనిపించేలా నిర్మించారు. ఇక విశాలమైన లివింగ్ ప్రాంతం అత్యాధునిక డైనింగ్ రూమ్ కలిగి ఉంటుంది.
అలాగే ఆ గదిని మీడియా గదితో అనుసంధానించారు. ఇది కుటుంబంతో కలిసి సినిమాలు చూడటానికి లేదా స్నేహితులకు ఆతిథ్యం ఇవ్వడానికి అనువైన చోటు. ఇక అథియా విల్లాలోని మరో ఆకర్షణీయమైన అంశం అల్ ఫ్రెస్కో స్పేసెస్. టెర్రస్ పై ఓ కప్పు టీ ఆస్వాదించినా.. నక్షత్రాల కింద భోజనం చేసినా ఆల్ ఫ్రెస్కో స్పేసెస్ రమణీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక ఈ డ్రీమ్ హోమ్ అద్భుత లక్షణాల్లో ఇన్ఫినిటీ పూల్ ఒకటి. దిగువ లోయలోని అద్భుతమైన వీక్షణలను అంతకంటే అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఇక విల్లా అంతటా ఫ్లోర్ టు సీలింగ్ కిటికీలు సహజమైన కాంతితో ఇంటీరియర్లను నింపుతాయి. ప్రకృతిలోని సున్నితమైన శబ్దాలు, పర్వత ప్రాంతాల నుంచి వచ్చే చల్లని గాలి ఇంట్లోని ప్రతి మూలనూ పలకరించి ఓదార్పు, ప్రశాంతమైన శక్తిని ప్రతిబింబింపజేస్తాయి.
విల్లా చుట్టుపక్కల ఉన్న విశాలమైన పచ్చికబయలు ఓ సీనరీ మాత్రమే కాదు.. అథియా పెంపుడు శునకాలకు ఆటస్థలంగా కూడా ఉంది. దీంతో ఇది నిజమైన పావ్ సిటివ్ హోమ్ గా మారింది. అవి బంతిని వెంబడించినా లేదా ఆరుబయట ఆనందిస్తున్నా.. ఈ శాంతియుత అభయారణ్యంలో మానవుల మాదిరిగానే నివసిస్తున్నాయి. ఖండాలాలోని ఈ డ్రీమ్ హోమ్.. సౌకర్యం, అందం, సహజ సామరస్యాల సంపూర్ణ సమ్మేళనంగా కనిపిస్తుంది. అథియా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.. తనను తాను రీఛార్జ్ చేసుకోవచ్చు.. జీవితంలో చక్కని ఆనందాలను పొందవచ్చు.