poulomi avante poulomi avante

బాలీవుడ్.. కేరాఫ్ బాంద్రా

ముంబై బాంద్రాలో ప్రాపర్టీలు కొనుగోలుకు బాలీవుడ్ నటుల మొగ్గు

ముంబై.. బాలీవుడ్ తారలకు చిరునామా. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా ఉన్న దేశ ఆర్థిక రాజధానిపై బాలీవుడ్ నటీనటులకు మక్కువ చాలా ఎక్కువ. అలాంటి ముంబైలో బాంద్రా అంటే మరింత క్రేజ్. చాలామంది బాలీవుడ్ నటనటులు బాంద్రాను తమ నివాస ప్రాంతంగా ఎంచుకున్నారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.లక్షపైనే ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తారాలోకం నుంచి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే, త్రిప్తి దిమ్రీ, సంజయ్ దత్ వంటి బాలీవుడ్ తారలు బాంద్రాలో ప్రాపర్టీ కలిగి ఉన్నారు. దిలీప్ కుమార్, రిషి కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా ఈ ప్రాంతంలో నివసించారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య జిల్లా అయిన బాంద్రా.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జీఎస్టీ, ఆర్బీఐ, ఆదాయపన్ను, ఫ్యామిలీ కోర్టు, యూఎస్ కాన్సులేట్ వంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలతోపాటు జియ్, యాపిల్, నెట్ ఫ్లిక్స్, గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి ఎంఎన్ సీలు కూడా ఉన్నాయి. బాంద్రా చుట్టూ ఉన్న అంధేరి, వెర్సోవా, జుహు, గోరేగావ్ ఫిల్మ్ సిటీ వంటి ప్రాంతాల్లో పలు బాలీవుడ్ స్టూడియోలు ఉండటం వంటి అంశాలు బాలీవుడ్ తారలు బాంద్రాను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు. గత ఏడాది కాలంగా బాంద్రాలో ప్రాపర్టీ కొన్న ఐదుగురు తారల గురించి తెలుసుకుందామా?

1. దీపికా పదుకొనే

ప్రముఖ నటి దీపికా పదుకొణె సంస్థ కేఏ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఏడాది సెప్టెంబర్ లో బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ₹17.7 కోట్లతో 1845 చదరపు అడుగుల అపార్ట్ మెంట్‌ను రూ.17.8 కోట్లకు కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్‌కు సమీపంలో ఉన్న సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 15వ అంతస్తులో పదుకొనే అపార్ట్ మెంట్‌ను కొన్నారు. ఈ డీల్‌కు దాదాపు రూ. 1.07 కోట్లు స్టాంపు డ్యూటీగా, రూ.30వేలు రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా చెల్లించారు.

2. ఆర్ మాధవన్

ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఈ ఏడాది జూలైలో బీకేసీలో రూ.₹17.5 కోట్లకు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ డీల్ లో భాగంగా రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వచ్చాయి.

3. సునీల్ శెట్టి కుటుంబం

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా సునీల్ శెట్టి ఈ ఏడాది జూలైలో బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో రూ.20 కోట్లతో అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. గ్రౌండ్ ప్లస్ 18 అంతస్తుల సంధు ప్యాలెస్ భవనంలోని రెండో అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాపర్టీ ఉంది. డీల్ లో భాగంగా నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు వచ్చాయి.

4. త్రిప్తి డిమ్రి

యానిమల్ సినిమా ఫేమ్ త్రిప్తి డిమ్రీ ముంబైలోని బాంద్రా వెస్ట్ ఏరియాలోని కార్టర్ రోడ్‌లో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల బంగ్లాను రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు. బంగ్లా మొత్తం విస్తీర్ణంలో 2,226 చదరపు అడుగుల విస్తీర్ణం, 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ప్రాంతం ఉంది.

5. అమీర్ ఖాన్

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో 1,027 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.9 కోట్లకు పైగా రెడీ-టు-మూవ్ అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. జూన్ 25న ఖరారు చేసిన ట్రాన్స్ ఫర్ డీడ్‌కు స్టాంప్ డ్యూటీ రూ. 58.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 30వేలు చెల్లించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles