- చెన్నైకి చెందిన జీ స్క్వేర్ ప్రకటన
హైదరాబాద్ రియల్ రంగం ఎటువైపు వెళుతుందో.. ఏయే ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే, ఈ రంగంలో పెరుగుతున్న వివాదాలే ఇందుకు ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఉదాహరణకు గురువారం జీ స్క్వేర్ అనే సంస్థ ప్రధాన పత్రికల్లో విడుదల చేసిన ప్రకటనను చూసి అనేక మంది ఆశ్చర్యపోయారు. కారణంగా.. జీ స్క్వేర్ మరియు వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ మధ్య నెలకొన్న వివాదామే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
చెన్నైకి చెందిన జీ స్వ్కేర్ అనే సంస్థ హయత్‌నగర్‌లోని సాహెబ్ నగర్ కలాన్ గ్రామం వెస్ట్రన్ తపోవన్ ఈడెన్ గార్డెన్ అనే వెంచర్‌ని డెవలప్ చేస్తోంది. అయితే, ఇందులోని 1.56 లక్షల గజాల స్థలాన్ని విక్రయించేందుకు వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీలేఖ రియల్టర్స్ మరియు జీ స్వ్కేర్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి వెస్ట్రన్ తపోవన్ అనే పేరు పెట్టడం జరిగింది. అయితే, ఇందులోని కొన్ని ప్లాట్లను జీ స్క్వేర్‌కు తెలియకుండా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ జీ స్క్వేర్ సంస్థ ప్రధాన పత్రికల్లో ప్రకటనల్ని గురువారం విడుదల చేశాయి.
ఈ విషయాన్ని తెలుసుకుని తాము రంగారెడ్డి కోర్టులో కేసు వేశామని జీ స్క్వేర్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీంతో, అక్టోబరు 20న రంగారెడ్డి అదనపు జడ్జీ ఆర్‌బిట్రేషన్ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోమని ఆదేశించారు. అందుకే, ప్రస్తుతం ఎవరూ ఇందులో ప్లాట్లు కొనకూడదని జీ స్క్వేర్ ప్రజల్ని కోరుతోంది. అయినా, ఎవరైనా ఈ వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేస్తే చట్టప్రకారం శిక్షకు గురి అవుతారని తెలిపారు.