- హంసానందిని సొంతింటి కబుర్లు
జీవితంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు కలిగి ఉండాలని చాలామంది కలలు కంటారు. కాకపోతే, ఆ కోరిక అందరిలోనూ ఉండదని స్పష్టం చేసింది ప్రముఖ నటి హంసా నందిని. ఇంతవరకూ రియల్ ఎస్టేట్ గురు చేసిన అనేక సెలబ్రిటీల ఇంటర్వ్యూలలో.. తను మాత్రమే కాస్త భిన్నమైన అభిప్రాయాల్ని వెల్లడించింది. అద్దె ఇళ్ల వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరించింది. అద్దె ఇళ్లల్లో ఉండటమే అన్నింటికన్నా ఉత్తమం అని పేర్కింది. ఎందుకంటే, నిర్వహణ ఖర్చులుండవు. పన్నులు కట్టక్కర్లేదు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ నివసించొచ్చని తెలియజేసింది. పైగా, అద్దె ఇళ్లల్లో నివసించడం వల్ల సొంతింటి కష్టాల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని హంసానందిని చెబుతోంది. రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. ఆమె పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. మరి, తనేం చెబుతుందో ఆమె మాటల్లోనే..
“నేను ఇంటి అలంకారాన్ని అతిగా చేయలేను. ఇంటి అందం శాశ్వత ముద్ర వేసేలా ఉండాలి. అలా అనీ మరీ ఖరీదైన ఇంటీరియర్స్ అంటే పెద్దగా ఇష్టపడను. ఇల్లు ఎప్పుడైనా క్లాసిక్‌గా ఉండాలన్నదే నా ఆలోచన. ఎందుకంటే, అప్పుడే ఇల్లనేది ఎప్పటికీ నిత్యనూతనంగా దర్శనమిస్తుంది. మినిమలిస్టిక్‌ను నేను ఎక్కువగా కోరుకుంటారు. ఎప్పటికైనా ఒక కళాఖండం కళాఖండమేనని చెప్పొచ్చు. అందుకే, అలాంటివి ఇష్టపడతాను.”
హంసా నందిని ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. అక్కడ బంగళాను అస్సలు కొననని ప్రమాణం చేసింది. ఎందుకలా అని రియల్ ఎస్టేట్ గురు ప్రశ్నించగా తను ఇలా జవాబిచ్చింది. కేవలం ముంబై కాదు.. ఏ మెట్రోపాలిటన్ నగరమైనా నా అభిప్రాయమిదే. అయితే, గోవాలో హాలీడే హోమ్ అంటే ఇష్టం. ఎందుకంటే, అక్కడి అందమైన బీచులు, రుచికరమైన సముద్రపు ఆహారం వల్ల నా సెలవుల్ని పూర్తిగా ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది. నా చుట్టూ పనివాళ్లు ఉండాలని నేను కోరుకోను. ఎందుకంటే, అది కూడా భారమని నేను భావిస్తాను.
” నాకు పచ్చని ప్రదేశాలు అంటే చాలా ఇష్టం! పచ్చదనంలో నివసించడం వల్ల ఇంద్రియాలకు మరియు ఆత్మకు పునరుజ్జీవనం కలుగుతుంది. ఇంట్లో తెల్లగోడ ఉండటం వల్ల అది స్వచ్ఛతను పెంచుతుంది. పైగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది. ఆపై ఫోటోగ్రాఫ్‌ల రూపంలో వ్యక్తిగత స్పర్శలను-జ్ఞాపకాలను గుర్తు తెచ్చకోవచ్చు. కొన్ని అలంకార వస్తువులు ట్రెండింగ్‌లో ఉంటాయి. అవి కొన్ని సందర్భాల్లో ఫ్యాన్సీగా మారతాయి. వాటిని కొందరు సెలబ్రిటీలు సొంతం చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాటికి నేను భిన్నంగా ఉంటాను. ఫ్యాన్సీలపై నాకు పెద్దగా వ్యామోహం లేదు. అలంకరణలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ చేయను. నేను కోరుకునే తెల్లటి రంగు ఖచ్చితంగా ప్రశాంతతను కలిగిస్తుంది.”