ప్రెస్టీజ్ గ్రూప్ రెడీ హోమ్స్ ఫెస్టివల్ సౌత్ ఇండియాకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చీ వంటి పట్టణాల్లో దాదాపు ఇరవై ప్రాజెక్టుల్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. అరవై రోజుల్లో గృహప్రవేశం చేయవచ్చని ప్రకటించింది. పైగా, ఈ నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభించడంతో జీఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదని చెబుతోంది. కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. కాబట్టి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఎన్ని ఫ్లాట్లు ఈ సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని రియల్ ఎస్టేట్ గురు కనుక్కుంది. సంస్థకు చెందిన జీఎం సురేష్ కుమార్ వివరాల ప్రకారం.. కేవలం రెండే రెండు ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రెస్టీజ్ హైఫీల్డ్స్‌లో 90, మాదాపూర్‌లోని ప్రెస్టీజ్ ఐవీ లీగ్‌లో రెండు యూనిట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
* ప్రెస్టీజ్ హైఫీల్డ్స్ ప్రాజెక్టులో టూ బెడ్రూమ్ (1283 చ.అ.), 4 పడక గదుల ఫ్లాట్లు (2729 చ.అ.) అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో నిర్మాణం ఆరంభించిన టవర్లన్నీ పూర్తయ్యాయి. 1,4,8, 9 టవర్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొందరు గృహప్రవేశం కూడా చేశారు. ఇందులో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.7,500గా సంస్థ చెబుతోంది. అదే 2, 3, 5, 7, 10 టవర్లలో ఫ్లాట్లు కొనాలంటే చదరపు అడుక్కీ రూ.6600 చెబుతుంది. దీనిపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. టవర్ 6 ఇంకా ఆరంభం కాలేదు. కాకపోతే, ఆరంభ ధర చదరపు అడుక్కీ రూ.7,999గా సంస్థ నిర్ణయించింది. దీనిపై ఐదు శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.