బాలీవుడ్ నటి జాన్వీ కపూర్
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ యువతార జాన్వీ కపూర్ జీవితం చాలా వేగంగా సాగింది. తనకు ప్రాణం పోసి, అపరిమితమైన ప్రేమను అందించిన ఆమె మాతృమూర్తి ఇప్పుడు తన పక్కన లేదు. సినిమా కెరీర్ లో జాన్వీ విజయవంతంగా ముందుకెళుతోంది. తల్లి ప్రేమకు దూరమైన జాన్వీ.. తన ఇంట్లో మాత్రం ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంది.
‘నా తల్లి మోగ్రాలను ఎంతగానే ఇష్టపడేది. అవి ఇచ్చే అందమైన సువాసన, అవి ప్రతిబింబించే సంస్కృతి ఆమెకు చాలా ఇష్టం. అందుకే మా అమ్మ కోసం మా ఇంట్లో మోగ్రాల తోట ఏర్పాటు చేశాం. నేను ఆమె జ్ఝాపకాన్ని సజీవంగా ఉంచుతాను. అలాగే రెహ్మాన్ సంగీతం, బోలెడన్ని నవ్వులు కూడా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో మా నాన్న బ్రేక్ డ్యాన్స్ చేస్తూ అమ్మను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేవారు. అందువల్ల మా ఇల్లు అనేది నా తల్లిదండ్రుల ప్రేమ గురించి కూడా’ అని జాన్వీ వివరించింది.
గృహ ప్రవేశం మరుసటి రోజు తాను నిద్ర లేచి చూసేసరికి ఆమె తండ్రి బోనీ కపూర్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న చిన్న ఫౌంటెయిన్ పక్కన కూర్చుని ఎగ్ శాండివిచ్ తింటూ కనిపించినట్టు గుర్తు చేసుకుంది. తన తల్లి లేని సమయంలో కూడా ఆమె కోరుకున్నది అదే అని ఆయన భావిస్తున్నట్టు చెప్పింది. ‘మాది చాలా పెద్ద కుటుంబం. నా డైనింగ్ స్పేస్ అంటే నాకు చాలా ఇష్టం. అది చాలా పెద్దది. మీరు భోజనం చేస్తున్నప్పుడు బార్ వరకు విస్తరించి ఉన్న పెద్ద కిటికీలో నుంచి బయట చెట్లను చూడొచ్చు. చాలా పచ్చదనం, సూర్యరశ్మిని ఆస్వాదించొచ్చు. అది నాకు చాలా నచ్చుతుంది’ అని జాన్వీ చెప్పింది.
జాన్వీ కపూర్ తన కోసం, తన తండ్రి కోసం ఈ కొత్త స్పేస్ తయారు చేస్తున్నప్పుడు చాలా న్యూట్రల్ కలర్స్ పై దృష్టి పెట్టింది. ఆమె దానిని ట్రిమ్ లేదా బెడ్ రూమ్ గోడలపై ఉపయోగించినప్పటికీ, స్ట్రేపల్ కలర్ ఆమె ప్రధానంగా కోరుకుంది. ఇవి ఆమె ఇతర డిజైన్లను మరింత ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయి. ‘మా ఇంటికి మరింత అనుభూతి తెచ్చేందుకు ఇంటి చుట్టూ చాలా ఆర్ట్ వర్క్, పెయింటింగులు ఉపయోగించాం. ఇంటీరియర్ డిజైనర్లు చాలా తెల్లని పాలరాయిని ఉపయోగించిన విధానం నాకు బాగా నచ్చింది. ఇది ఎప్పుడూ మనల్ని నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్ కు తీసుకెళ్తుంది. మీ ఇల్లు మీ గురించి ఏదో చెబుతుందని వారు అనరు. మా ఇల్లు లేదా గోడలు మాట్లాడగలిగితే మేం ఒకరినొకరు ఎంత పిచ్చిగా ప్రేమించుకుంటున్నామో చెబుతారు’ అని జాన్వీ తెలిపింది.
క్లాసికల్ ఎలిమెంట్స్ ఆమె ఇంట్లో సమరూపత లక్షణాలను నింపుతాయి. ఆమె ఆధునిక అభిరుచులు, విలువలకు అనుగుణంగా ఇంటిని అందంగా అలంకరించారు. ఈ విషయంలో అటు క్లాసిక్, ఇటు లేటెస్ట్ ట్రెండ్ అనుసరించారు. ప్రతి గది ప్లేస్ మెంట్, ఇంట్లోకి సహజమైన కాంతి ప్రసారం వంటి అంశాలు జాన్వీ ఇంటిని ఎంతో అందంగా చేశాయి.